AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VARANASI: గ్లింప్స్​లో చూపించిన దేవత ఎవరు? ఆ రహస్యంతో రాజమౌళి మాయ చేయనున్నారా

ఎస్​.ఎస్​ రాజమౌళి సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, లోతైన సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలను వెలికితీస్తాయి. ఆర్ఆర్​ఆర్​ సూపర్​సక్సెస్​ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న సినిమా ‘వారణాసి’. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్​తో సూపర్​స్టార్​ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా గ్లింప్స్‌ ..

VARANASI: గ్లింప్స్​లో చూపించిన దేవత ఎవరు? ఆ రహస్యంతో రాజమౌళి మాయ చేయనున్నారా
Varanasi Poster
Nikhil
|

Updated on: Nov 21, 2025 | 10:41 AM

Share

ఎస్​.ఎస్​ రాజమౌళి సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, లోతైన సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలను వెలికితీస్తాయి. ఆర్ఆర్​ఆర్​ సూపర్​సక్సెస్​ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న సినిమా ‘వారణాసి’. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్​తో సూపర్​స్టార్​ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా గ్లింప్స్‌ ఇటీవలే విడుదల చేశారు. ఆ గ్లింప్స్లో ఆయన చూపించిన చినమస్తా దేవి రూపం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

తల లేకుండా, స్వయంగా తన తలను ఖడ్గంతో నరికి, రక్తధారలు తాగుతూ నిలబడిన ఆ భయంకరఅద్భుత రూపం… క్షణంలోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. రాజమౌళి చినమస్తాదేవిని సినిమాలో కీలకంగా చూపడం ద్వారా మళ్లీ తన మార్క్ చూపిస్తున్నారు. ఈ గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెండింతలు చేశారు. ఇంతకీ చినమస్తా దేవి ఎవరో తెలుసా?

ఆకలి తీర్చేందుకు తల నరుక్కుని..

హిందూ మిథాలజీలో దశ మహావిద్యలలో ఆరవ స్థానంలో నిలిచిన చిన్నమస్తా దేవి, తన అసాధారణమైన రూపంతో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది. ఆమె రూపం అహాన్ని త్యజించడం, జీవశక్తి అనంతత్వం, మాయను అధిగమించడం సూచిస్తుంది. ‘చిన్న’ అంటే తెగించిన, ‘మస్త’ అంటే తల – ఈ పేరు తాను తన తలను తొలగించుకున్న దైవిక శక్తిని సూచిస్తుంది. ఈ దేవత, పార్వతి యొక్క భయంకర రూపంగా పరిగణించబడుతుంది. ఆమె ఆరాధన తంత్ర శాస్త్రంలో ప్రధానమైనది. దేవీ భాగవత పురాణంలో ఆమె కథ ప్రారంభమవుతుంది.

ఒకసారి పార్వతి తన సహచరులైన దాకిణి, వర్ణిణి లతో స్నానం చేస్తుండగా, వారికి ఆకలి అధికమవుతుంది. మాతృ ప్రేమతో ఆమె తన తలను నరికేసుకుంటుంది. ఆమె గొంతులోంచి మూడు రక్తధారలు ప్రవహిస్తాయి. రెండు ధారలు ఇద్దరు సహచరుల ఆకలి తీర్చగా, మూడవది ఆమె స్వయంగా స్వీకరిస్తుంది. ఈ చర్య జీవ శక్తి అనంతత్వాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని సూచిస్తుంది. ఇది కుండలిని జాగృతి, మాయా మోచనానికి మార్గం.

చిన్నమస్తా దేవి యొక్క చిత్రణ కూడా అద్భుతం. ఆమె రెక్కలు లేకుండా, కళ్ళు మూసుకుని, కర్ణాలు ప్రసరించి, ఖడ్గం, తన తలను పట్టుకుని నిలబడి ఉంటుంది. ఆమె పాదాల కింద సూర్యచంద్రులు ఉంటారు. ఇది సృష్టి, స్థితి, లయలను సూచిస్తుంది. తంత్ర గ్రంథాల ప్రకారం, ఆమె కలికుల శాఖలో ప్రధానమైనది. ఆమె జయంతి వైశాఖ శుక్ల పక్ష చతుర్దశిలో జరుగుతుంది. ఆమె ఆలయాలు అరుదు.

ఉత్తరప్రదేశ్‌లోని వారాణసి సమీపంలో రామ్‌నగర్‌లోని ఆలయం, బెంగాల్‌లోని బిష్ణుపుర్‌లోనిది ప్రసిద్ధి. నేపాల్‌లో కూడా ఆమెను పూజిస్తారు. ఆమె ఆరాధకులు యోగులు, సైనికులు, వీరులు. అహాన్ని, మరణ భయాన్ని అధిగమించడానికి ఆమెను పూజిస్తారు. రాజమౌళి వారణాసి సినిమాలో చినమస్తాదేవి కథను ఎలా చెప్పబోతున్నారనేది తెలియాలంటే సినిమా రిలీజ్​ అయ్యేవరకు వేచిచూడాల్సిందే!

Follow Us