శ్రీదేవీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఈ నటీమణి ఎవరో గుర్తుపట్టారా.? నోరు తెరిస్తే అల్లరే అల్లరి..

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'క్షణం క్షణం' మూవీ గురించి సినీ లవర్స్‌కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శివలాంటి సంచలన విజయం తర్వాత వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగం నిలిచింది. శ్రీదేవీ, వెంకటేష్‌ మార్క్‌ యాక్టింగ్‌.. వర్మ దర్శకత్వం శైలి ఈ సినిమాను పెద్ద విజయం చేసింది...

శ్రీదేవీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఈ నటీమణి ఎవరో గుర్తుపట్టారా.? నోరు తెరిస్తే అల్లరే అల్లరి..
Kshana Kshanam
Follow us

|

Updated on: May 29, 2023 | 5:11 PM

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్షణం క్షణం’ మూవీ గురించి సినీ లవర్స్‌కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శివలాంటి సంచలన విజయం తర్వాత వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగం నిలిచింది. శ్రీదేవీ, వెంకటేష్‌ మార్క్‌ యాక్టింగ్‌.. వర్మ దర్శకత్వం శైలి ఈ సినిమాను పెద్ద విజయం చేసింది. ఈ సినిమా నంది అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రల్లో శ్రీదేవీ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ కూడా ఒకటి.

ఆఫీసులో శ్రీదేవీ కొలిగ్‌గా నటించిన పాత్ర సినిమా చూసిన వారికి గుర్తుండే ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో, చలాకీ తనంతో ఆకట్టుకున్న ఆ నటీమణి ఎవరో మీలో ఎంత మందికి గుర్తుపడతారు.? ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు వారిని ఆకట్టుకుంటుంది. తన కామెడీ టైమింగ్‌తో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రోల్‌కి పర్‌ఫెక్ట్‌గా దూసుకుపోతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా తనదైన చలాకీ మాటలతో సందడి చేస్తుంటుంది. ఇప్పుడైనా ఈ నటీమణి ఎవరో గుర్తించారా.?

ఇవి కూడా చదవండి

ఈ నటీమణి మరెవరో కాదు.. సీనియర్‌ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ హెమానే. 1989లో చిన్నారి స్నేహం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన హెమా ఎన్నో సూపర్ హిట్‌ మూవీస్‌లో నటించింది. ఆ సమయంలోనే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘క్షణం క్షణం’ మూవీతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్‌లో సుమారు 200 చిత్రాల్లో నటించిన హెమా తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. అంతేనా పలు వెబ్‌ సిరీస్‌లతో పాటు బిగ్‌బాస్‌ 3లోనూ హెమా ఎంట్రీ ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..