Prabhas Fan: దటీజ్ ప్రభాస్.. ఫ్యాన్ చివరి కోరిక తీర్చాడు..! పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్..

Prabhas Fan: దటీజ్ ప్రభాస్.. ఫ్యాన్ చివరి కోరిక తీర్చాడు..! పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్..

Anil kumar poka

|

Updated on: May 29, 2023 | 4:32 PM

చూడ్డానికి బాహుబలి కటౌట్‌లో గంభీరంగా కనిపించినా.. యాక్షన్ సినిమాలు చేస్తూ.. అందుకోని రికార్డులను క్రియేట్ చేసినా.. ప్రభాస్ మనసు మాత్రం వెన్న..! మర్యాదలోనూ.. తన దగ్గరికి వచ్చిన వారికి సాయం చేయడంలోనే.. తనే మిన్నే! ఇది ఎవరో కాదు.. ఆయనతో పని చేసని ప్రతీ ఒక్కరూ చెప్పిందిదే! ఇక దీన్నే మరో సారి నిజం చేస్తూ..

చూడ్డానికి బాహుబలి కటౌట్‌లో గంభీరంగా కనిపించినా.. యాక్షన్ సినిమాలు చేస్తూ.. అందుకోని రికార్డులను క్రియేట్ చేసినా.. ప్రభాస్ మనసు మాత్రం వెన్న..! మర్యాదలోనూ.. తన దగ్గరికి వచ్చిన వారికి సాయం చేయడంలోనే.. తనే మిన్నే! ఇది ఎవరో కాదు.. ఆయనతో పని చేసని ప్రతీ ఒక్కరూ చెప్పిందిదే! ఇక దీన్నే మరో సారి నిజం చేస్తూ.. తన హార్డ్ కోర్‌ ఫ్యాన్‌ చివరి కోరికను తీర్చారు మన బాహుబలి ప్రభాస్. ఓ పక్క సలార్ షూట్తో మరో పక్క మారుతీ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన ఫ్యాన్స్‌ను ఇటీవల కలిశారు ప్రభాస్. అవును! ఏపీ నర్సీపట్నానికి చెందిన రంజిత్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని.. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారని రంజిత్ తల్లి ద్వారా తెలుసుకున్న ప్రభాస్.. రంజిత్‌ను సలార్ సెట్ కు ఇన్‌వైట్ చేశారు. అక్కడే కలిసి ఆ సినిమాలోని కత్తిని రంజిత్‌కు గిఫ్ట్ గా ఇచ్చి ఖుషీ చేశారు. దాంతో పాటే… రంజిత్‌కు ఎంతో ఇష్టమైన చికెన్ మంచూరియాను తెప్పించి మరీ స్వయంగా వడ్డించారు. ఆ తరువాత చాలా సేపు కబుర్లు చెప్పి.. తన హార్డ్ కోర్‌ ఫ్యాన్‌ను చిరు నవ్వుతో.. పంపించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే రంజిత్ విగతజీవిగా మారిపోయారు. కానీ.. ప్రభాస్‌ ను కలిసి వీడియో బయటికి రావడంతో.. సోషల్ మీడియాలో మాత్రం చిరు నవ్వుతో సజీవంగానే వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.