ఆ యంగ్ హీరోకు నాగ్‌ మరో అవకాశం ఇస్తున్నారా.!

షార్ట్‌ ఫిలింస్‌లతో గుర్తింపు తెచ్చుకొని ఉయ్యాల జంపాలతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు రాజ్‌ తరుణ్‌. అంతేకాదు

ఆ యంగ్ హీరోకు నాగ్‌ మరో అవకాశం ఇస్తున్నారా.!
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2020 | 4:44 PM

Nagarjuna Raj Tarun: షార్ట్‌ ఫిలింస్‌లతో గుర్తింపు తెచ్చుకొని ఉయ్యాల జంపాలతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు రాజ్‌ తరుణ్‌. అంతేకాదు ఆ తరువాత హ్యాట్రిక్ హిట్‌ని ఖాతాలో వేసుకొని మోస్ట్ వాంటెండ్‌ హీరోగా మారిపోయారు. ఆ తరువాత కూడా పలు హిట్లను ఖాతాలో వేసుకున్నారు. అయితే గత మూడు నాలుగు సంవత్సరాలుగా అతడి ఖాతాలో విజయం పడటం లేదు. హిట్ నిర్మాత దిల్‌ రాజుతో పనిచేసినప్పటికీ విజయం వరించలేదు.

కాగా ఉయ్యాల జంపాల నిర్మాతల్లో నాగార్జున ఒకరు కాగా.. అప్పటి నుంచి రాజ్‌ తరుణ్‌కి నాగ్‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. అంతేకాదు ఆ తరువాత రంగుల రాట్నంతో మరో అవకాశం ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం రాజ్‌ తరుణ్‌కి నాగ్‌ మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. అయితే వెబ్‌సిరీస్‌లో నటించేందుకు కూడా తాను రెడీగా ఉన్నానని రాజ్‌తరుణ్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రాజ్ తరుణ్‌ నటించిన ఒరేయ్ బుజ్జిగా అక్టోబర్‌లో ఓటీటీలో విడుదల అవ్వనుంది. ఈ సినిమా తరువాత శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. ఇంతకుముందు ఈ కాంబినేషన్లో సీతమ్మ అందాలు- రామయ్య చిత్రాలు సినిమా వచ్చింది.

Read More:

IPL 2020: రికార్డు బ్రేక్ చేసిన ఐపీఎల్‌ ఓపెనింగ్ మ్యాచ్‌

కేసీఆర్ కిట్‌ పేరిట మోసం.. కేసు నమోదు చేసిన పోలీసులు