AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయే ముందు ఆపదలో ఉన్నానని సుశాంత్ చెప్పాడట.!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం వెనుక దాగున్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటివరకు దొరకలేదు. దాదాపు మూడు నెలలు గడిచింది.

చనిపోయే ముందు ఆపదలో ఉన్నానని సుశాంత్ చెప్పాడట.!
Ravi Kiran
|

Updated on: Sep 22, 2020 | 11:48 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం వెనుక దాగున్న ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటివరకు దొరకలేదు. దాదాపు మూడు నెలలు గడిచింది. ఇప్పటికీ సుశాంత్ మృతికి సంబంధించిన చిక్కుముడులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుండగా.. రోజుకో కొత్త ట్విస్ట్ బయటపడుతోంది. ఇక తాజాగా సుశాంత్ చనిపోయే ముందు తన సోదరి మీతూ సింగ్‌కు పంపిన ఓ SOS వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది జాతీయ మీడియాలో సంచలన సృష్టిస్తోంది. (Sushant Singh Rajput SOS Call)

Also Read: శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

జాతీయ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం.. సుశాంత్ తన మరణానికి ముందు.. తాను ఆపదను ఎదుర్కుంటున్నట్లు సంకేతాలను కుటుంబసభ్యులకు పంపించినట్లు స్పష్టమవుతోంది. సరిగ్గా మరణానికి ఐదు రోజుల ముందు తన సోదరి మీతూ సింగ్‌కు సుశాంత్ ఓ SOS పంపించాడు. ”అక్కా భయమేస్తోంది. వాళ్లు నన్ను చంపేస్తారేమో.? అని అనుమానంగా ఉంది. వాళ్లు నన్ను ఏదో ఒక దానిలో ఇరుక్కునేలా చేస్తారు. ఈ సమయంలో నీతో మాట్లాడాలనుకుంటున్నా” అనే మెసేజ్ పంపాడు. ఇక సుశాంత్ మరణించిన మూడు నెలల తర్వాత ఈ SOS వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో సుశాంత్‌ను మానసికంగా ఎవరు హింసించారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం సీబీఐ, ఈడీ, ఎన్సీబీ అధికారులు సుశాంత్ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ SOS వెలుగులోకి రావడంతో.. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.