శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

మాట ఇవ్వడం తేలికే.. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం.. అయితే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం తను ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నెరవేర్చాడు.

  • Ravi Kiran
  • Publish Date - 12:38 pm, Sat, 19 September 20

మాట ఇవ్వడం తేలికే.. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం.. అయితే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నెరవేర్చాడు. ఇక ఈ హీరో చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది విజయవాడలోని ‘అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్’ వారు తమను ఆదుకోవాలని.. ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఆర్ధిక సాయం చేయాలని పలువురు సినీ ప్రముఖులను ట్విట్టర్ వేదికగా కోరారు.

వారిని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సాయి ధరమ్ తేజ్ ”తాను ఆదుకుంటానని.. అండగా నిలుస్తానని” హామీ ఇచ్చాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారం సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన సొంత ఖర్చులతో రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించాడు. వృద్దులకు ఓ నీడను కల్పించాడు. ఇక ఈ మంచి పనిలో తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. (Sai Dharam Tej Fulfilled His Promise)

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!