వివాదంలో ముమైత్‌ఖాన్.. క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు
స్పెషల్ పాటల స్పెషలిస్ట్ ముమైత్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై హైదరాబాద్‌కి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు చేశారు.
Mumaith Khan controversy: స్పెషల్ పాటల స్పెషలిస్ట్ ముమైత్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై హైదరాబాద్‌కి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు చేశారు. తనకు 15వేలు ఇవ్వకుండా మోసం చేసిందంటూ అతడు ఆరోపించారు.
క్యాబ్ డ్రైవర్ రాఘవ రాజు చెప్పిన వివరాల ప్రకారం.. గోవాలో 3 రోజుల పాటు ఉండేందుకు ముమైత్ ఖాన్ క్యాబ్ బుక్ చేసుకుందని, ఆ తరువాత 8 రోజులకు అక్కడే ఉందని అన్నారు. ఇక తిరిగి వచ్చిన తరువాత తనకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని అతడు ఆరోపించారు. ఆమెను గోవాకు తీసుకు వెళ్లినట్లు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అతడు చెబుతున్నారు. అంతేకాదు ఆమెతో తీసుకున్న సెల్ఫీని కూడా రాఘవ రాజు చూపిస్తున్నారు. తనకు ఆ నటి డబ్బులు చెల్లించేలా చేయాలని ఆయన అంటున్నారు. మరి ఈ విషయంపై ముమైత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read More: