క్రేజీ కాంబో.. రానాతో రొమాన్స్ చేయనున్న శ్రుతీ
కొన్ని కాంబినేషన్లు అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి కాంబోలో రానా, శ్రుతీ హాసన్ జోడి ఒకటి
Rana Shruti Haasan: కొన్ని కాంబినేషన్లు అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. అలాంటి కాంబోలో రానా, శ్రుతీ హాసన్ జోడి ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే కారణాలు ఏవైనా.. ఇంతవరకు ఈ జోడీ ఒక్క సినిమా కూడా కనిపించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఓ వెబ్‌సిరీస్ కోసం ఈ ఇద్దరు తొలిసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో స్టార్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ వెబ్‌సిరీస్‌ని చేయబోతున్నారట. దీనికి నాగ్ అశ్విన్ కథను మాత్రమే అందిస్తుండగా.. కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారట. ఇక థ్రిల్లర్ కథాంశంతో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కనుండగా.. అందులో రానా, శ్రుతీ కలిసి నటించనున్నారట. 10 ఎపిసోడ్‌లుగా ఈ సిరీస్ ఉండనుండగా.. తెలుగులో దీన్ని తెరకెక్కిస్తున్నారట. అయితే 10 భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Read More: