ఆర్కే నాయుడుతో దిల్‌రాజు ‘షాదీ ముబారక్’
ఓ వైపు భారీ బడ్జెట్ మూవీలు తీస్తూనే మరోవైపు లో బడ్జెట్ చిత్రాలను తీస్తుంటారు దిల్ రాజు. ముఖ్యంగా ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లపై ఆసక్తిని చూపే
Shaadi Mubarak Sagar: ఓ వైపు భారీ బడ్జెట్ మూవీలు తీస్తూనే మరోవైపు లో బడ్జెట్ చిత్రాలను తీస్తుంటారు దిల్ రాజు. ముఖ్యంగా ప్రేమ కథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌లపై ఆసక్తిని చూపే ఈ నిర్మాత ఇప్పుడు సీరియల్ స్టార్‌తో ఓ ప్రేమ కథను నిర్మిస్తున్నారు. నటుడ సాగర్‌తో షాదీ ముబారక్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో పాటు ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఇక ఈ మూవీ ద్వారా ద్రిష్య రఘునాధ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం షాదీ ముబారక్ షూటింగ్ కూడా పూర్తి అయ్యిందని, త్వరలోనే ఓటీటీలో విడుదల కానుందని టాక్.
కాగా చక్రవాకం, మొగలి రేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకు సాగర్ పరిచయం అయ్యారు. మొగలి రేకులులో ఆయన నటించిన ఆర్కే నాయుడు పాత్ర సాగర్‌కి మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తరువాత వెండితెరపై మిస్టర్ పర్‌ఫెక్ట్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే నాలుగేళ్ల క్రితం సిద్ధార్థ్ అనే చిత్రంలో ఆయన నటించగా.. అది పరాజయం అయ్యింది. ఇక ఇప్పుడు షాదీ ముబారక్‌తో హీరోగా హిట్ కొట్టేందుకు వస్తున్నారు.
Read More: