రాజకీయవేత్త కుమార్తెతో యాంకర్ ప్రదీప్ పెళ్లి..!

లాక్‌డౌన్ సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లి బాజాలు మోగాయి. నిఖిల్‌, రానా, నితిన్, దిల్ రాజు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు

రాజకీయవేత్త కుమార్తెతో యాంకర్ ప్రదీప్ పెళ్లి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 30, 2020 | 12:40 PM

Anchor Pradeep marriage: లాక్‌డౌన్ సమయంలోనూ టాలీవుడ్‌లో వరుస పెళ్లి బాజాలు మోగాయి. నిఖిల్‌, రానా, నితిన్, దిల్ రాజు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇక తాజాగా యాంకర్ ప్రదీప్ ఆ లిస్ట్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రదీప్ పెళ్లి అవ్వబోతున్నట్లు సమాచారం.

ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఓ పేరు మోసిన రాజకీయవేత్త కుమార్తెను ప్రదీప్ పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబాలు మాట్లాడుకున్నాయని.. మరో రెండు, మూడు నెలల్లో వీరి పెళ్లి జరగనుందని టాక్‌. ఇన్నిరోజులు ఈ విషయాన్ని ప్రదీప్ సీక్రెట్‌గా పెట్టినప్పటికీ.. ఇటీవల లీక్ అయినట్లు తెలుస్తోంది.

కాగా రేడియో జాకీగా తన కెరీర్‌ని మొదలు పెట్టిన ప్రదీప్‌.. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్‌ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక వెండితెరపైనా 100%లవ్‌, జులాయి, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో కనిపించిన ప్రదీప్.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. మార్చిలో ఈ మూవీ విడుదల కావల్సి ఉండగా.. లాక్‌డౌన్ రావడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

Read More:

Allu Arjun Pushpa: ‘పుష్ప’లో విలన్ నేను కాదు

సీబీడీ ఆయిల్‌ని చట్టబద్ధం చేయండి: ఇర్ఫాన్ భార్య విఙ్ఞప్తి