AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabharat: బాలీవుడ్ మహా భారతంలోని పాండవుల మధ్యముడు దొరికేశాడా..! టాలీవుడ్ స్టార్ హీరో అంటూ టాక్..

బాలీవుడ్ లో స్టార్ హీరో అమీర్ ఖాన్ చాలా కాలం తర్వాత గుడ్ న్యూస్ చెప్పాడు. లాల్ సింగ్ చద్దా తర్వాత.. ఇప్పుడు అమీర్ ఖాన్ మళ్ళీ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ' సితారే జమీన్ పర్' విడుదల తేదీ వెల్లడైంది. ఈ సినిమా ట్రైలర్ కూడా త్వరలో విడుదల చేయడనికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ కలల ప్రాజెక్ట్ 'మహాభారతం' కూడా వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ని తీసుకోవడానికి రెడీ అయినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

Mahabharat: బాలీవుడ్ మహా భారతంలోని పాండవుల మధ్యముడు దొరికేశాడా..! టాలీవుడ్ స్టార్ హీరో అంటూ టాక్..
Mahabharatam
Surya Kala
|

Updated on: May 13, 2025 | 11:17 AM

Share

అమీర్ ఖాన్ మళ్ళీ వరస సినిమాలతో బిజిబిజిగా మారనున్నట్లు.. అమీర్ పునరాగమనం గురించి బలమైన ప్రచారం జరుగుతోంది. ‘లాల్ సింగ్ చద్దా’ పరాజయం పాలైన చాలా సంవత్సరాల తర్వాత అమీర్ తిరిగి నటిస్తున్నాడు. ఇటీవలే సితారే జమీన్ పర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇండియా-పాకిస్తాన్ ఉద్రిక్తత కారణంగా వాయిదా పడిన ట్రైలర్ కూడా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ కలల ప్రాజెక్ట్ అయిన ‘మహాభారతంతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అతను తరచుగా తన ఈ సినిమా గురించి మాట్లాడుతుంటాడు. కొంతకాలం క్రితం అమీర్ ఖాన్ తాను శ్రీకృష్ణుడి పాత్రతో ప్రభావితమయ్యానని చెప్పాడు. ఇప్పుడు. అతను ఈ సినిమా కోసం పాండవుల మధ్యముడు ‘అర్జున్’ పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసినట్లు చెబుతున్నాడు.

‘మహాభారతం’లో కృష్ణుడి పాత్రను అమిర్ ఖాన్ పోషిస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంతలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో కలిసి అమీర్ ఖాన్ కనిపించాడు. జనాలు వీరిద్దరినీ ఒకే చోట చూడగానే.. వీరు ఇద్దరు ఎందుకు కలిశారు అనే ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఇప్పుడు మహాభారతం సినిమాలో అర్జున్ ఓ పాత్రను పోషించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

‘మహాభారతం’లో అర్జున్ పాత్రను ఎవరు పోషిస్తారంటే

ఇటీవల సినీజోష్‌లో ఒక వార్త ప్రచురితమైంది. ఈ సినిమాలో అర్జునుడి పాత్రకు అల్లు అర్జున్‌ను తీసుకోవాలని అమిర్ ఖాన్ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల అల్లు అర్జున్, అమిర్ ఖాన్ ముంబైలో కలిశారు. అప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమిర్ ఖాన్‌ను కలవడం వెనుక మరో పెద్ద కారణం ఉందని కూడా చెబుతున్నారు. అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో అమీర్ ఖాన్ నటించనున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. ఈ కారణంగానే అల్లు అర్జన్, అట్లీతో కలిసి అమిర్‌ను కలవడానికి ముంబై వచ్చారని బీ టౌన్ లో టాక్. అయితే ఇప్పుడు రెండు వార్తల్లో ఎంత నిజం ఉందో అమిర్ మాత్రమే చెప్పగలడు.

నివేదిక ప్రకారం సంజయ్ లీలా భన్సాలీ అమిర్ ఖాన్ మహాభారతం పార్ట్ 1 కి దర్శకత్వం వహిస్తారు. అదే సమయంలో అమిర్ ఖాన్ ఈ చిత్రం కోసం వివిధ పరిశ్రమల నుంచి నటీనటులను ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనేక భాగాలుగా నిర్మించబడుతుంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

శ్రీ కృష్ణుడి నుంచి ప్రేరణ పొందిన అమీర్.

ఇటీవల అమిర్ ఖాన్ తన కలల ప్రాజెక్ట్ మహాభారతం గురించి మాట్లాడాడు. మహాభారతం తీయడం తన కల అని చెబుతున్నాడు. అయితే కృష్ణుడి పాత్ర తనను బాగా ఆకట్టుకుందని కూడా ఆయన అన్నారు. ఇప్పుడు పాండవులలో మధ్యముడైన అర్జునుడి పాత్రకు అల్లు అర్జున్ ఎంపిక వార్తలు నిజమైతే రాజమౌళికి అది షాకింగ్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి కూడా మహాభారతం సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా SSMB29 తర్వాత మాత్రమే పట్టాలెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్