Astrology of Number 8: న్యూమరాలజీలో 8వ సంఖ్య ప్రాముఖ్యత ఏమిటి? ఈ సంఖ్యకు శనీశ్వరుడికి సంబంధం ఏమిటో తెలుసా
జ్యోతిష్యశాస్త్రాన్ని , హస్త సాముద్రికంతో పాటు కొంతమంది న్యూమరాలజీని కూడా నమ్ముతారు. తమ భవిష్యత్ ను తెలుసుకోవడానికి న్యూమరాలజీని ఆశ్రయిస్తారు. సంఖ్యాశాస్త్రంలో అంకెలు 1 నుంచి 9 వరకు ఉంటాయి. రాడిక్స్ మీ లక్షణాలు, స్వభావం గురించి కూడా చెబుతుంది. న్యూమరాలజీ ప్రకారం 8వ సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది శనిశ్వరుడితో ముడిపడి ఉంది. ఇది శక్తి, సమతుల్యత , చర్యకు చిహ్నం. 8 వ సంఖ్యకి జ్యోతిషశాస్త్ర అర్థం, శనిశ్వరుడితో దీనికి గల సంబంధం గురించి వివరంగా తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రంలో ప్రతి సంఖ్యకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఒక వ్యక్తి వ్యక్తిత్వం, విధి , జీవిత ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది. సంఖ్యాశాస్త్రంలో 8వ సంఖ్యకు ముఖ్యమైన స్థానం ఉంది. ఇది శనిశ్వరుడికి నేరుగా సంబంధించినది. ఈ సంఖ్య శక్తి, సమతుల్యత , కర్మను సూచిస్తుంది. 8వ సంఖ్య గల వ్యక్తులు కష్టపడి పనిచేస్తారు. దృఢ సంకల్పం కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అయితే వీరు జీవితంలో కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. శనిశ్వరుడితో ఉన్న సంబంధం కారణంగా, కర్మ, న్యాయం ఈ వ్యక్తుల జీవితాల్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. 8వ సంఖ్య కు గల జ్యోతిషశాస్త్ర అర్థం , శనిశ్వరుడితో దీని సంబంధం గురించి తెలుసుకుందాం.
8వ సంఖ్యకి జ్యోతిషశాస్త్ర అర్థం
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏదైనా నెలలో 8, 17 లేదా 26 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 8. ఈ సంఖ్య బలం, సమతుల్యత, సమృద్ధికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీని ఆకారం అనంత చిహ్నాన్ని పోలి ఉండటం వల్ల.. ఇది ఆధ్యాత్మిక, భౌతిక ప్రపంచాల మధ్య సమతుల్యతను సూచిస్తుంది.
8వ సంఖ్య ఉన్న వ్యక్తులు ప్రతిష్టాత్మకంగా, దృఢ సంకల్పంతో, కష్టపడి పనిచేసేవారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వీరు కష్టపడి పనిచేస్తారు. వీరికి సహజ నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి. ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. తరచుగా వీరు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే బాధ్యతాయుతమైన, విశ్వసనీయ వ్యక్తులుగా ప్రసిద్ధి చెందుతారు.
అయితే 8 సంఖ్య ఎల్లప్పుడూ అనుకూలంగా పరిగణించబడదు. ఈ సంఖ్య గల వారు జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోరాటాలు కూడా చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, కష్టపడి పనిచేసినప్పటికీ..ఆశించిన ఫలితాలను సాధించడంలో జాప్యాలు లేదా అడ్డంకులు ఏర్పడవచ్చు. ఈ వ్యక్తులు సహనం, పట్టుదల కలిగి ఉండాలి.
శనిశ్వరుడితో సంబంధం
సంఖ్యాశాస్త్రంలో 8 వ సంఖ్యను పాలించే గ్రహంశనిశ్వరుడిగా పరిగణించబడుతుంది. శనిశ్వరుడిని కర్మ ప్రధాత. న్యాయానికి అధిపతి అని చెబుతారు. మనుషులు చేసే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. అందుకే 8వ సంఖ్య ఉన్నవారి జీవితంలో కర్మకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీరి చర్యలను బట్టి వీరికి విజయం లేదా వైఫల్యం లభిస్తుంది.
8వ సంఖ్య ఉన్నవారిలో కూడా శనిశ్వరుడి లక్షణాల ప్రభావం కనిపిస్తుంది. ఈ వ్యక్తులు తరచుగా గంభీరంగా, ఆలోచనాత్మకంగా, క్రమశిక్షణతో ఉంటారు. వీరు నియమ నిబంధనలను పాటిస్తారు. తమ బాధ్యతలను తీవ్రంగా తీసుకుంటారు. శనిశ్వరుడి లాగే 8వ సంఖ్య గల వ్యక్తులు కూడా ఓపికగా ఉంటారు. ఏదైనా పనిని పూర్తి చేయడానికి సమయం పట్టవచ్చు. కానీ వీరి విజయం శాశ్వతంగా ఉంటుంది.
8వ సంఖ్య ప్రభావంతో ఉన్న వ్యక్తులు శనిశ్వరుడి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అయితే శనిశ్వరుడి ఆశీర్వాదం పొందడానికి వ్యక్తి తన కర్మలను పవిత్రంగా ఉంచుకుని, న్యాయ మార్గాన్ని అనుసరించడం అవసరం.
జీవితంపై 8వ సంఖ్య ప్రభావం
కెరీర్: ఈ వ్యక్తులు తరచుగా టెక్నాలజీ, ఇంజనీరింగ్, పెట్రోలియం, ఇనుము, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో విజయం సాధిస్తారు. వీరు అద్భుతమైన పరిపాలనా సామర్థ్యాలను కలిగి ఉంటారు. తద్వారా వీరు నాయకత్వ పాత్రలకు అనుకూలంగా ఉంటారు.
సంపద: 8వ సంఖ్య సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. అయితే ఇది తరచుగా కృషి, క్రమశిక్షణ తర్వాత మాత్రమే సాధించబడుతుంది. ఈ రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వ్యక్తిగత జీవితం: 8వ సంఖ్య ఉన్న వ్యక్తులు తమ కుటుంబానికి అంకితభావంతో ఉంటారు. తమ ప్రియమైన వారిని కాపాడుకుంటారు. వీరు నమ్మకమైన సహచరులుగా భావించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు