- Telugu News Photo Gallery Summer Health Care Tips: Avoid eating these vegetables in summers for better health
Summer Health Tips: వేసవి సీజన్ లో ఈ కూరగాయలు పొరపాటున కూడా తినొద్దు.. ఎందుకంటే
వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి చల్లని స్వభావం గల వస్తువులను తీసుకోవాలి. అది పండ్లు అయినా, కూరగాయలు అయినా.. సీజన్ కు అనుగుణంగా ఆరోగ్య అలవాట్లను చేసుకోవడం.. సీజనల్ ఆహారాన్ని తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఈ నేపధ్యంలో వేసవిలో కూడా తినే కూరగాయల విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండలి. కొన్ని కూరగాయలు సహజంగా వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ విషయం తెలియక వాటిని వేసవిలో కూడా తింటారు.తరువాత వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక వేసవిలో ఏ కూరగాయలు తినకూడదో తెలుసుకుందాం.
Updated on: May 13, 2025 | 8:35 AM

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు ఆహారంలో చల్లని స్వభావం గల వాటిని చేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సీజన్‌లో అజీర్ణం, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. కనుక ఈ సీజన్‌లో తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తినాలి. మరోవైపు ఈ సీజన్‌లో మనం ఆలోచించకుండా ఏదైనా తింటే, మొదట అది మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అసలు సడెన్ గా ఎందుకు అనారోగ్య బారిన పడ్డామో కూడా అర్ధం చేసుకోలేరు కొందరు. కనుక ఈ రోజు మనం వేసవి కాలంలో ఏ కూరగాయలు తినకూడదో తెలుసుకుందాం.

వేసవిలో కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. నిజానికి ఈ సీజన్‌లో పనస కాయ, వంకాయ, చేమ దుంపలు వంటి వేడి చేసే గుణం కలిగి ఉన్న కూరగాయలు తినడం ఆరోగ్యానికి హానికరం. వేసవి కాలంలో ఆరోగ్యానికి ఈ కూరగాయలు శత్రువులు అని చేపవచ్చు. కనుక ఈ రోజు వేసవిలో ఎ కూరగాయలు తినడం వల్ల నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం..

వేసవిలో ఈ 4 కూరగాయలను ఎప్పుడూ తినకండి, వంకాయ వేసవిలో ఆరోగ్యానికి శత్రువు. వంకాయ ఒక వేడి కూరగాయ మరియు వేసవిలో దీనిని తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. మలబద్ధకం, ఆమ్లత్వం వంటి కడుపు సమస్యలు వస్తాయి. దీనితో పాటు చర్మ అలెర్జీ కూడా సంభవించవచ్చు.

కాలీఫ్లవర్: వేసవి కాలంలో కాలీఫ్లవర్ తినకూడదు ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది, ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది.

పనస పొట్టు: పనస కాయకు కూడా వేడి చేసే స్వభావం కారణంగా, వేసవిలో దాని వినియోగాన్ని తగ్గించాలి లేదా అస్సలు తినకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యానికి హానికరం.

చేమ దుంపలు: మూత్రపిండాల సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు వేసవి కాలంలో చేమ దుంపలను తినకూడదు. నిజానికి చేమ దుంపల్లో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మూత్రపిండాల పని తీరుని దెబ్బతీస్తుంది. దీనిలో ఉండే కార్బోహైడ్రేట్లు డయాబెటిక్ రోగులకు హానికరం.

వేసవిలో జీర్ణ సమస్యలను కలిగించే కొన్ని రకాల కూరగాయలను తినకుండా ఎంత దూరం ఉంటే అంత మంచిది. అయితే ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే ఆనపకాయ, పొట్లకాయ, బీర కాయ, దోసకాయ, లేడీఫింగర్, టమోటా వంటి కూరగాయలు తినాలి.




