Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? బ్యాంక్ జాబ్ మానేసి సినిమాల్లోకి.. బిగ్‌బాస్‌ తెలుగు లోనూ దుమ్మురేపింది

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలామంది కెరీర్ ప్రారంభంలో ఏవేవో ఉద్యోగాలు, పనులు చేసిన వారే. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. డిగ్రీలో కామర్స్ పట్టా పుచ్చుకున్న ఈ బ్యూటీ ఐఎన్ జీ వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగం చేసింది.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? బ్యాంక్ జాబ్ మానేసి సినిమాల్లోకి.. బిగ్‌బాస్‌ తెలుగు లోనూ దుమ్మురేపింది
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: May 13, 2025 | 12:07 PM

పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు కానీ ఇంతకు ముందు ఈ అమ్మడు పలు తెలుగు సినిమాల్లో కనిపించింది. కొన్ని సూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుంది. ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితమైనప్పటికీ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. సాధారణంగా సినిమా హీరోయిన్లుగా కొనసాగుతూ ఎవరూ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకు వెళ్లరు. కానీ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కొనసాగుతుండగానే బిగ్ బాస్ తెలుగే సీజన్-4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అలాగే తోటి కంటెస్టెంట్ తో ప్రేమ వ్యవహారం నడిపి వార్తల్లో నిలిచింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అందాల తారకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. దీంతో తన సొంత రాష్ట్రం గుజరాత్ కు వెళ్లిపోయిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అక్కడే సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజి బిజీగా ఉంటోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు సుడిగాడు సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన మోనాల్ గజ్జర్. మంగళవారం (మే13) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మోనాల్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగా 2014లో చివరిగా బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అనే సినిమాలో నటిగా కనిపించింది మోనాల్. మళ్లీ 2021లో అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ తో సందడి చేసింది. ఆ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ గుజరాతి సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో బిజీగా ఉంటోంది.

మోనాల్ లేటెస్ట్ ఫొటోస్..

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మోనాల్. రెగ్యులర్ గా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తూ ఉంటుంది. మరి మోనాల్ లేటెస్ట్ ఫొటోస్ పై ఓ లుక్కేయండి.

 ట్రెడిషినల్ లుక్ లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.