Katrina Wedding: ఓమిక్రాన్ ఎఫెక్ట్.. కత్రినా పెళ్లికి పరిమిత సంఖ్యలోనే ఆహ్వానితులు!
కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఓమిక్రాన్‌గా రూపుమార్చుకున్న ఈ మహమ్మారి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది . ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది
కరోనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఓమిక్రాన్‌గా రూపుమార్చుకున్న ఈ మహమ్మారి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది . ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావం కారణంగా దేశంలో మళ్లీ మునపటిలా ఆంక్షలు, నిబంధనలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది శుభకార్యాలపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. కాగా బాలీవుడ్ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ వచ్చే నెలలో పెళ్లిపీటలెక్కుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ మొదటివారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ వేడుకకు అతిథులను కూడా పెద్ద సంఖ్యలో ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఓమిక్రాన్ ప్రభావంతో ఇప్పుడు అతిథుల సంఖ్యను భారీగా తగ్గించారట. ఈ మేరకు కత్రినా-విక్కీ కుటుంబ సభ్యులు వెడ్డింగ్ ప్లానర్స్‌తో చర్చలు కూడా జరిపారట.
ఆహ్వానితుల జాబితా మారుస్తున్నాం.. రాజస్థాన్ లోని విలాసవంతమైన సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో డిసెంబరు 9న కత్రినా- విక్కీలు పెళ్లి పీటలెక్కనున్నారని కత్రినా బంధువులతో పాటు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ రోజు సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరుగుతుందని వారు తెలిపారు. ‘ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, దర్శక నిర్మాతలను ఈ పెళ్లికి ఆహ్వానించాలనుకున్నాం. ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై పునరాలోచిస్తున్నాం. పరిమిత సంఖ్యలోనే ఆహ్వానితుల జాబితాను తయారుచేస్తున్నాం. కత్రినా పెళ్లికి విదేశాల నుంచి కూడా చాలామంది వస్తున్నారు. కొత్త వేరియంట్ ప్రభావంతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉండడంతో ఆ జాబితా కూడా మారవచ్చు. కొత్త వేరియంట్‌కు సంబంధించి మేం ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించాలనుకోవట్లేదు. అందులో భాగంగా ఆహ్వానితుల సంఖ్యను తగ్గించడంతో పాటు పెళ్లి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తున్నాం’ అని కత్రినా, విక్కీల సన్నిహితుడొకరు వెల్లడించారు.
Also Read:
Acharya: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సిద్ద.. “ఆచార్య” టీజర్‌కు సూపర్ రెస్పాన్స్..
Mahesh Babu : సూపర్ స్టార్ సినీ ప్రస్థానానికి 42 ఏళ్ళు.. వైరల్ అవుతున్న మహేష్ కామన్ డీపీ..