AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh bachchan: కూతురు, మనవరాలి కోసం జిలేబీ లాంటి ప్రశ్నలు సిద్ధం చేసిన బిగ్‌ బీ.. ఆసక్తికరంగా కేబీసీ వెయ్యో ఎపిసోడ్‌ ప్రోమో..

సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి కలలను సాకారం చేస్తున్న గేమ్‌ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షోకు భారతీయ టెలివిజన్‌ చరిత్రలో ప్రత్యేక స్థానముంది...

Amitabh bachchan: కూతురు, మనవరాలి కోసం జిలేబీ లాంటి ప్రశ్నలు సిద్ధం చేసిన బిగ్‌ బీ.. ఆసక్తికరంగా కేబీసీ వెయ్యో ఎపిసోడ్‌ ప్రోమో..
Basha Shek
|

Updated on: Nov 29, 2021 | 11:17 AM

Share

సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ వారి కలలను సాకారం చేస్తున్న గేమ్‌ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షోకు భారతీయ టెలివిజన్‌ చరిత్రలో ప్రత్యేక స్థానముంది. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్‌ బాలీవుడ్‌ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ టీవీ షో మరో మైలురాయికి చేరువైంది. త్వరలోనే కేబీసీ 1000వ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. అదేవిధంగా గత 21 ఏళ్లుగా బాలీవుడ్ బిగ్‌ బి అమితాబ్‌ విజయవంతంగా ఈ గేమ్‌ షోను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్‌ ఎపిసోడ్‌ను పురస్కరించుకుని అమితాబ్‌ కూతురు శ్వేతా బచ్చన్‌, మనవరాలు నవ్యా నవేలి నందా ఈ గేమ్‌ షోకు అతిథులుగా హాజరయ్యారు. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో వీడియోలు విడుదలయయ్యాయి. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఒకే ఫ్రేమ్‌లో బిగ్‌బీ ఫ్యామిలీ కనిపించడం చూడముచ్చటగా ఉందని సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ విషయాన్ని స్వయంగా తన ఫాలోయర్స్‌కి తెలిపిన నవ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ‘కేబీసీ’ సెట్ మీద నుంచి తాతతో కలసి కెమెరాలకు పోజులిస్తూ.. ’21 ఏళ్ల తరువాత… 999 ఎపిసోడ్స్ అనంతరం’ అని క్యాప్షన్‌ పెట్టింది ! ఇక ప్రోమోలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో భాగంగా కేబీసీ హాట్‌ సీట్‌లో కూర్చొని నవ్య తన తాతతో మాట్లాడుతూ ‘ ఈ హాట్ సీట్‌పైకి ఎవరు వచ్చినా ‘కేబీసీ’ కోసం ఎలా ప్రిపేర్‌ అయ్యారని మీరు (అమితాబ్‌) అడుగుతుంటారు . కానీ ఈ రోజు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను.. మీరు మా కోసం ఎలాంటి ప్రశ్నలు సిద్ధం చేశారు ‘ అని హిందీలో అడుగుతుంది. దీనికి బదులుగా ‘ ఈ ప్రశ్నలు జిలేబి లాగా సూటిగా ఉంటాయి. అదేవిధంగా క్విజ్ కూడా మేజ్‌లా చాలా సులభంగా ఉంటుంది’ అని అమితాబ్‌ చెప్పుకొచ్చారు. అప్పుడు శ్వేత తన కూతురు నవ్యతో ‘ ఆయన 1000 ఎపిసోడ్‌ పూర్తి చేయడానికి ఎదురుచూస్తున్నారు’ అని చెప్పగా, ‘మేం సిద్ధంగా ఉన్నాం’ అని నవ్య సమాధానమిస్తుంది. ఈ క్రమంలో ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం(డిసెంబర్‌3)  రాత్రి 9గంటలకు  స్టార్‌ప్లస్‌ ఛానెల్‌లో ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది.

Also Read:

Shiva Shankar Master Deth: తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు..

Bimbisara: త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం “బింబిసారా”.. టీజర్ అదుర్స్..

Anchor Ravi First Interview With TV9: ఎందుకు ఎలిమినేట్ అయ్యానో తెలీదు..! ఆసక్తికర విషయాలు వెల్లడించిన రవి.. (వీడియో)