AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న బాలీవుడ్ హీరోయిన్.. సేమ్ టూ సేమ్ బ్లాక్ వాటర్.. లీటర్ రేట్ ఎంతో తెలుసా..

బాలీవుడ్ హీరోయిన్ ఉర్వశీ రౌటేలా ఇటీవల విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేసి.. అభిమానులను హెల్ప్ చేయాలంటూ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుపై

విరాట్ కోహ్లీని ఫాలో అవుతున్న బాలీవుడ్ హీరోయిన్.. సేమ్ టూ సేమ్ బ్లాక్ వాటర్.. లీటర్ రేట్ ఎంతో తెలుసా..
Urvashi Rautela
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2021 | 11:10 AM

Share

బాలీవుడ్ హీరోయిన్ ఉర్వశీ రౌటేలా ఇటీవల విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేసి.. అభిమానులను హెల్ప్ చేయాలంటూ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుపై నెటిజన్లు రకారకాలుగా స్పందించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఉర్శవీ ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వస్తూ.. కెమెరాల చేతికి చిక్కింది. అయితే ఇందులో ఒక విషయం బయటపడింది. ముంబై విమానాశ్రయం నుంచి బయటకు వస్తూన్న సమయంలో ఉర్వశి చేతిలో ఓ బ్లాక్ బాటల్ కనిపించింది. దీంతో ప్రస్తుతం ఉర్వశీ చేతిలోని బ్లాక్ వాటర్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఫిట్‏నెట్ కోసం చాలా మంది ప్రముఖులు.. అలాగే క్రీడాకారులు ఈ బ్లాక్ వాటర్ తాగుతుంటారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇదే బ్లాక్ వాటర్ తాగుతానని చాలా సందర్బాల్లో చెప్పుకోచ్చాడు. ఈ నీళ్ళలో హైడ్రేటెడ్‏గా ఉండడమే కాకుండా.. పీహెచ్ అధికంగా ఉంటుంది. రెగ్యులర్ వాటర్ బాటిల్ ధర రూ.20-రూ.30 ఉండగా.. ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు రూ.3000 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఉర్వశీ.. ఇన్‏స్పెక్టర్ అవినాష్ అనె వెబ్ సిరీస్ చేస్తుంది. ఇందులో రణదీప్ హూడా ప్రధాన పాత్రలో నటించగా… నీరజ్ పాథక్ దర్వకత్వం వహిస్తున్నారు. ఇది అవినాష్ మిశ్రా అనే పోలీస్ ఆఫీసర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. అంతేకాకుండా.. ఉర్వశీ.. జీ స్టూడియోతో మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్పలో ఓ ఐటెమ్ సాంగ్‌లో ఊర్వశీ మెరవనుందని తెలుస్తోంది. కాగా, 2019 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి మైనపు బొమ్మతో దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

Pragya Jaiswal: బాలయ్య ఎనర్జీకే పవర్‌ హౌస్‌.. నందమూరి నటసింహంపై ప్రగ్యా ప్రశంసలు

లెజెండరీ హీరో శశికపూర్ జయంతి నేడు.. శశికపూర్, జెన్నిఫర్‏ల అందమైన ప్రేమకావ్యం మీకు తెలుసా..

సౌందర్య ఎక్స్‏పోజింగ్ అందుకే చేయలేదట.. అసలు విషయాన్ని బయటపెట్టిన సీనియర్ హీరోయిన్..