లెజెండరీ హీరో శశికపూర్ జయంతి నేడు.. శశికపూర్, జెన్నిఫర్‏ల అందమైన ప్రేమకావ్యం మీకు తెలుసా..

Shashi Kapoor Birthday : బాలీవుడ్ లెజండరీ హీరో శశికపూర్ పుట్టినరోజు నేడు. మార్చి 18న 1938లో పశ్చిమ బెంగాల్‏లోని కోల్ కత్తాలో జన్మించారు. కొన్ని సినిమాలకు

లెజెండరీ హీరో శశికపూర్ జయంతి నేడు.. శశికపూర్, జెన్నిఫర్‏ల అందమైన ప్రేమకావ్యం మీకు తెలుసా..
Shashi Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 18, 2021 | 12:55 PM

Shashi Kapoor Birthday : బాలీవుడ్ లెజండరీ హీరో శశికపూర్ పుట్టినరోజు నేడు. మార్చి 18న 1938లో పశ్చిమ బెంగాల్‏లోని కోల్ కత్తాలో జన్మించారు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2011 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అనారోగ్యంతో శశి కపూర్ ముంబైలోని కోకిలబెన్ హాస్పిటల్లో 2017, డిసెంబర్ 4 (సోమవారం)న మరణించాడు. ఆ దివంగత నటుడి అందమైన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.

శశి కపూర్ 1958 లో జెన్నిఫర్ కెండాల్‌ను వివాహం చేసుకున్నాడు. జెన్నిఫర్ చెల్లెలు ఫెలిసిటీ కాండిల్ తన వైట్ కార్గో పుస్తకంలో వీరిద్దరి ప్రేమకథ గురించి చెప్పుకోచ్చింది. శశి కపూర్‏ను నేరుగా చూడకముందు జెన్నిఫర్ తన స్నేహితురాలితో కలిసి ఓ నాటకం ప్రదర్శించడానికి ఒపెరా హౌస్ కు వెళ్లింది. ఆ నాటకంలో శశికపూర్‏ను మొదటి సారి చూసింది. ఆ సమయానికి శశికపూర్ అంతగా గుర్తింపు సాధించలేదు. శశికపూర్ తన ప్రేమ గురించి.. తన పుస్తకం పృథ్వీవాలజ్‏లో ఇలా రాసుకోచ్చాడు.. నేను జెన్నిఫర్ యొక్క నాటకాలను చూశాను. కానీ ఆమె ఎలాంటి నోటీసు తీసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత రాయల్ ఒపెరా హౌస్‏లో ఒక రోజు నేను ముంబైలో ఉన్నప్పుడు ఆమెను నేను మొదటి సారి కలుసుకున్నాను. ఆ తర్వాత మేం తరచూ కలుసుకునేవాళ్ళం అంటూ తెలిపాడు. శశికపూర్ కంటే జెన్నిఫర్ 5 సంవత్సరాలు పెద్దది. తాను జెన్నిఫర్‏ను ఎక్కువగా ముంబైలోనే కలుసుకునేవాడినని పుస్తకంలో రాసుకోచ్చాడు శశికపూర్.. ప్రారంభంలో జెన్నిఫర్‏తో మాట్లాడటానికి శశికపూర్ చాలా సిగ్గుపడేవాడని.. దీంతో తన గురించి జెన్నిఫర్ మరో రకంగా అనుకుందని..కొన్ని అపార్థాలు వచ్చాయని తెలిపాడు. ఆ తర్వాత క్రమంగా వారిద్ధరి మధ్య ఏర్పడిన అపార్థాలు తొలగిపోయి.. సంతోషంగా గడిపినట్లుగా తన పుస్తకంలో చెప్పుకోచ్చాడు శశికపూర్..

Also Read:

సౌందర్య ఎక్స్‏పోజింగ్ అందుకే చేయలేదట.. అసలు విషయాన్ని బయటపెట్టిన సీనియర్ హీరోయిన్..

మొదటిసారి కొడుకు ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరో.. ఇంతకీ అబ్బాయి పేరు ఎంటో తెలుసా..