సౌందర్య ఎక్స్‏పోజింగ్ అందుకే చేయలేదట.. అసలు విషయాన్ని బయటపెట్టిన సీనియర్ హీరోయిన్..

సౌందర్య.. ఈ పేరు వినబడగానే అందమైన రూపం కళ్లముందు కదిలినట్లుగా అనిపిస్తుంది. అభినవ సావిత్రిగా పేరు సంపాధించుకున్న అందాల తార ఈమె.

సౌందర్య ఎక్స్‏పోజింగ్ అందుకే చేయలేదట.. అసలు విషయాన్ని బయటపెట్టిన సీనియర్ హీరోయిన్..
Soundarya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 18, 2021 | 9:57 AM

సౌందర్య.. ఈ పేరు వినబడగానే అందమైన రూపం కళ్లముందు కదిలినట్లుగా అనిపిస్తుంది. అభినవ సావిత్రిగా పేరు సంపాధించుకున్న అందాల తార ఈమె. సంప్రదాయపు పద్దతిలో తన నటనతో కొన్నెళ్లూ.. నిరంతరంగా టాప్ హీరోయిన్‏గా కోనసాగింది. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 వయసులోనే మరణించింది. ఈమె మరణంతో ఒక్కసారిగా అటు సినీ ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షక లోకం షాక్‏కు గురయ్యింది. ఆమె మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ సౌందర్యను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. తమిళ, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది సౌందర్య. ఈమె అసలు పేరు సౌమ్య.. పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగులోనే అత్యధిక సినిమాలు చేసింది.

కొన్నెళ్లు ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ ఇవ్వకుండానే.. చనిపోయేవరకు సౌందర్య టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. రోజా, రమ్యకృష్ణ, మీనా లాంటి అగ్రహీరోయిన్లు తమ గ్లామర్‏తో గట్టిపోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం సంప్రదాయపు అమ్మాయిగానే సినిమాల్లో నటించింది. ఇక సౌందర్యకు అప్పట్లో ఇండస్ట్రీలో స్నేహితులు కూడా తక్కువే. హీరోల్లో జగపతిబాబు, శ్రీకాంత్.. హీరోయిన్లలో ఆమనితో ఎక్కువగా క్లోజ్‌గా ఉండేది ఈమె. ఇప్పుడు సీనియర్ నటి ఆమని ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా చావు కబురు చల్లగా.. ఇందులో సీనియర్ హీరోయిన్ ఆమని కీలక పాత్రలో నటించింది. తాజాగా ఈ మూవీకి గురించి మాట్లాడుతూ.. సౌందర్యతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. సౌందర్య ఎక్స్‏పోజింగ్ ఎందుకు చేయలేదని విషయాన్ని తెలిపింది. ఒకసారి ఇద్దరమే షూటింగ్‌లో ఉన్నపుడు.. ఎక్స్‌పోజింగ్ గురించి అడిగాను. వెంటనే.. ఎందుకే ఎక్స్‌పోజ్ చేయాలి.. రేపు పెళ్లై భర్త పక్కనే ఉన్నపుడు తన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది.. మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది అలా గ్లామర్ షో చేసినపుడు అంటూ చెప్పిందని గుర్తిచేసుకుంది ఆమని. అందుకే సౌందర్య ఎక్స్‏పోజింగ్‏కు దూరంగా ఉన్నట్లు చెప్పుకోచ్చింది.

Also Read:

మొదటిసారి కొడుకు ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరో.. ఇంతకీ అబ్బాయి పేరు ఎంటో తెలుసా..

అక్క పాత్ర కోసం ముందు ఆ స్టార్ హీరోయిన్‏ను కలిసాను.. కానీ.. ఆసక్తికర విషయాలను పంచుకున్న మంచు విష్ణు..