అక్క పాత్ర కోసం ముందు ఆ స్టార్ హీరోయిన్‏ను కలిసాను.. కానీ.. ఆసక్తికర విషయాలను పంచుకున్న మంచు విష్ణు..

విభిన్న సినిమాలను ఎంచుకుంటూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో మంచు విష్ణు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై

అక్క పాత్ర కోసం ముందు ఆ స్టార్ హీరోయిన్‏ను కలిసాను.. కానీ.. ఆసక్తికర విషయాలను పంచుకున్న మంచు విష్ణు..
Manchu Vishnu
Follow us

|

Updated on: Mar 18, 2021 | 7:21 AM

విభిన్న సినిమాలను ఎంచుకుంటూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో మంచు విష్ణు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మించిన సినిమా మోసగాళ్లు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాల, హిందీ భాషల్లో ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రచారంలో భాగంగా మంచు విష్ణు మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమా విడుదల రోజు టెన్షన్ ఉండడం కామన్. నా సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మార్కెట్లో నాకున్న వేల్యూ కన్నా ఈ సినిమాకు ఎక్కువగా ఖర్చు పెట్టాను అంటూ చెప్పుకోచ్చాడు. ఈ కథపై ఉన్న నమ్మకంతో ఎలాంటి పెరామీటర్స్ ఆలోచించకుండా ఖర్చు పెట్టి ఈ మూవీ చేసాను. నేను అమెరికా, లాస్ ఏంజిల్స్ వెళ్లినప్పుడు ఈ సినిమాలో అనుకున్న విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ముంబై మీడియాలోనూ దీని గురించి ఎక్కువగా రాశారు. అమెరికాలో ఉన్నప్పుడు ఈ స్కామ్ కు సంబంధించినన ఫోన్ కాల్ కూడా నాకు వచ్చింది. ప్రకృతి ఈ పాయింట్ తో సినిమా చేయమని నాకు చెప్పినట్లు అనిపించింది. అందుకే వెంటనే మూవీ స్టార్ అయ్యింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హైదరాబాద్‏లోని ఓ బస్తీలో ఉండే అక్క, తమ్ముడు అమెరికాకు వెళ్లి అక్కడ వేల మంది కుటుంబాలను రోడ్డున పడేలా చేశారు. తెల్లవాళ్లు కదా.. వాళ్ళ దగ్గర డబ్బులుంటాయని వాళ్లు అనుకుని తెలివి తేటలతో మోసం చేసి డబ్బు సంపాదించి అటు అమెరికన్ ప్రభుత్వానికి, ఇటు ప్రభుత్వానికి దొరకకుండా ఎలా తప్పించుకున్నారనేదే సినిమా. ఈ మూవీ అనుకున్నప్పుడు ఆ అక్కాతమ్ముళ్ళను కలుసుకోలేదు. కానీ మిగతా వారందరిని కలుసుకున్నాను. ముందు డ్రాఫ్ట్ తయారు చేసుకున్నప్పుడు కథలోని గ్యాప్ ను బట్టి చాలా లిబర్టీ తీసుకున్నాను. అంతేకాకుండా డైరెక్టర్ జెప్రీ గీ చిన్ వచ్చిన తర్వాత మరో డ్రాఫ్ట్ రెడీ అయ్యింది. మన ప్రేక్షకులకు తగ్గట్టుగా దీనిని మార్పులు చేయడానికి డైమండ్ రత్నబాబు గారికి సంప్రదించాను. అలా తొంబై శాతం నిజమైన కథ.. పదిశాతం లిబర్టీస్ కథ ఈ సినిమా. ఇందులో ప్రధాన వ్యక్తులు మన దేశానికి చెందినవారు ఆయనపేరు చెప్పలేను. కానీ. మన భారతదేశం పరువు పోకూడదని.. మన దేశం తరపున సీన్సియ్రర్ గా డ్యూటీ చేసిన పోలీస్ ఆఫీసర్ ను ఈ మూవీ సమయంలో కలిసాను. టఫ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్ కోసం సునీల్‌ శెట్టి గారిని తీసుకున్నాను. ఈ సినిమా చేసే సమయంలో నాకు చాలా కొత్త విషయాలు తెలిశాయి. ఓ ఆర్టికల్‌ను బేస్‌ చేసుకుని సినిమా తీయాలన్నా రైట్స్‌ తీసుకోవాలి. అలాగే స్కామ్‌లో మెయిన్‌గా ఉన్న అక్క, తమ్ముడు నాపై కేసు వేస్తే ఫేస్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. సినిమా కోసం ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ఈ సినిమా ఇన్సూరెన్స్‌కే నా బడ్జెట్‌లో ఇరవై శాతం ఖర్చయ్యింది. హాలీవుడ్‌లో సినిమా చేసే ముందు జరిగే ప్రీ ప్రొడక్షన్‌ చాలా ఫోకస్‌గా ఉంటుంది. ఎక్కువ బడ్జెట్‌ పెట్టిన మూవీ. యూనివర్సల్‌ కథాంశం. ఇతర భాషల్లో విడుదల చేసుకోవడానికి స్కోప్‌ ఉందనిపించి పాన్‌ ఇండియా మూవీ మోసగాళ్లు సినిమా చేశాను. ఇండియన్‌ వెర్షన్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. ఇక ఇంగ్లీష్‌ వెర్షన్‌ షూటింగ్‌ వారం, పది రోజులు పెండింగ్‌ ఉంది.  ఓ స్టార్‌ హీరోయిన్‌, అందరికీ తెలిసిన హీరోయిన్‌ను నా అక్క పాత్రలో నటింప చేయాలని అనుకున్నప్పుడు ముందు ప్రీతి జింటా గారిని కలిశాను. ఆవిడ కాస్త భయపడ్డారు.  కాజల్‌ అగర్వాల్‌ ఆలోచనకు రాగానే, ఆమెను అడిగాను. కాజల్‌ చాలా స్పోర్టివ్‌గా తీసుకుని సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఇక నిర్మాతగా నేను ఇప్పటి వరకు మూడు సిరీస్‏లు చేయబోతున్నాను. అందుకు సంబంధించిన పూర్తివివరాలను ఏప్రిల్ లో ప్రకటిస్తాను. ఇక ఢీ అండ్ ఢీ ఇప్పటికే స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఇంకా శ్రీను వైట్లగారు స్టోరీ రెడీ చేసే పనిలో ఉండిపోయారు. ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఈ మూవీ ప్రారంభం కావచ్చు. ఢీకి ఇ సీక్వెల్ కాదు.

Also Read:

Nabha Natesh: అక్కినేని హీరోతో జతకట్టనున్న ఈస్మార్ట్‌ బ్యూటీ..? ఈ సినిమాతోనైనా ట్రాక్‌ ఎక్కేనా..

Latest Articles
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక