AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: అక్కినేని హీరోతో జతకట్టనున్న ఈస్మార్ట్‌ బ్యూటీ..? ఈ సినిమాతోనైనా ట్రాక్‌ ఎక్కేనా..

Nabha Natesh: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార నభా నటేష్‌. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ అనంతరం...

Nabha Natesh: అక్కినేని హీరోతో జతకట్టనున్న ఈస్మార్ట్‌ బ్యూటీ..? ఈ సినిమాతోనైనా ట్రాక్‌ ఎక్కేనా..
Nabha Natesh New Movie
Narender Vaitla
|

Updated on: Mar 18, 2021 | 2:55 AM

Share

Nabha Natesh: సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార నభా నటేష్‌. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ అనంతరం ‘అదిగో’ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిందీ బ్యూటీ. ఈ సినిమాలో మాస్‌ పాత్రలో నటించిన నభా.. కుర్రకారును కట్టి పడేసింది. ఇక నభా తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో నభా నటేష్‌ ఫేమ్‌ తగ్గిపోతోందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే తాజాగా ఈ అందాల తార మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నభా నటేష్‌ను హీరోయిన్‌గా తీసుకోవడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. ముగ్గురిలో ఒక స్టార్‌ హీరోయిన్‌ తీసుకొని మిగతా ఇద్దరిని కొత్త వారిని తీసుకోవాలని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే ఆ స్టార్‌ హీరోయిన్‌ మరెవరో కాదు నభానే అని టాక్‌ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. మరి ఈ సినిమాలో నభా నటిస్తుందా.? ఒకవేళ నటిస్తే.. మళ్లీ ఫామ్‌లోకి వస్తుందా చూడాలి.

Also Read: “సారంగ దరియా” వివాదంపై లేటెస్ట్ అప్‌డేట్.. దర్శకుడు శేఖర్ కమ్ముల, గాయని కోమలి కలిసి స్టేట్‌మెంట్

Jagapathi Babu Annaatthe Movie : రజనీతో ముచ్చటగా మూడోసారి.. మరోసారి నెగిటివ్ రోల్‌లో అలరించనున్న జగ్గూబాయ్..

VakeelSaab New Song : వకీల్ సాబ్ నుంచి కంటిపాప కంటి పాప సాంగ్ రిలీజ్ .. ఆకట్టుకుంటున్న థమన్ సంగీతం

Follow Us
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
క్షణం క్షణం భయం..4 ఏళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న హర్రర్ మూవీ ఇదే
కేరళ స్టోరీ 2 విడుదలకు అంతా సిద్ధమేనా.. అసలు వస్తుందా..?
కేరళ స్టోరీ 2 విడుదలకు అంతా సిద్ధమేనా.. అసలు వస్తుందా..?
ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే..
ఆ ఒక్కడిపై అందరి కళ్లు.. తిక్కరేగి చెలరేగాడో సఫారీల ఖేల్ ఖతమే..
కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీళ్ళు జీవితాంతం కోటీశ్వరులు..
కుబేరుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీళ్ళు జీవితాంతం కోటీశ్వరులు..
చాణక్య నీతి: ఈ 6 లక్షణాలున్నవారు ఎప్పుడూ ధనవంతులు కాలేరు..!
చాణక్య నీతి: ఈ 6 లక్షణాలున్నవారు ఎప్పుడూ ధనవంతులు కాలేరు..!
వరుసగా ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్..!
వరుసగా ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్..!
మీ బైక్‌లో పెట్రోల్ ట్యాంక్‌ ఫుల్‌ అయినట్లు ఎలా తెలుస్తోంది..?
మీ బైక్‌లో పెట్రోల్ ట్యాంక్‌ ఫుల్‌ అయినట్లు ఎలా తెలుస్తోంది..?
లొంగిపోయిన మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేతలు..
లొంగిపోయిన మావోయిస్ట్‌ పార్టీ అగ్రనేతలు..
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం
ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం