“సారంగ దరియా” వివాదంపై లేటెస్ట్ అప్‌డేట్.. దర్శకుడు శేఖర్ కమ్ముల, గాయని కోమలి కలిసి స్టేట్‌మెంట్

"లవ్ స్టోరి" చిత్రంలో 'సారంగ దరియా' పాట విషయంలో వివాదం ముగిసింది. ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి సారంగ దరియా పాటను సినిమాలో ఉపయోగించడంపై

సారంగ దరియా వివాదంపై లేటెస్ట్ అప్‌డేట్.. దర్శకుడు శేఖర్ కమ్ముల, గాయని కోమలి కలిసి స్టేట్‌మెంట్
Saranga Dariya Controversy
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 17, 2021 | 6:35 PM

Saranga Dariya Controversy: “లవ్ స్టోరి” చిత్రంలో ‘సారంగ దరియా’ పాట విషయంలో వివాదం ముగిసింది. ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి సారంగ దరియా పాటను సినిమాలో ఉపయోగించడంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన అనంతరం కోమలి ప్రకటన చేసింది.

గాయని కోమలి మాట్లాడుతూ…సారంగ దరియా పాట లవ్ స్టోరి సినిమాలో నాతో పాడించలేదనే బాధ ఇన్ని రోజులు ఉండేది. అదే ఆరాటాన్ని కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశాను. రేలారె రేలా ద్వారా సారంగ దరియా పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ గారి చొవరతో ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని కలిశాను. సంతోషంగా ఉంది. ఆయన తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అలాగే ‘లవ్ స్టోరి’ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో స్టేజీ మీద ‘సారంగ దరియా’ పాట నాతోనే పాడిస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అన్నారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…ఇన్ని రోజులు కమ్యునికేషన్ సమస్య వల్ల గాయని కోమలి గారిని కలవలేకపోయాను. ఇవాళ ముఖాముఖి మాట్లాడుకున్నాం. నేను ఆమెకు మాటిచ్చినట్లు భవిష్యత్ లో నా సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలికి పాట పాడే అవకాశం ఇస్తాను. నేను సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటానని చెప్పాను. కోమలి గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నాను. అన్నారు.

Also Read:

Vakeel Saab Review: సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఈజ్ బ్యాక్… ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్

TTD News: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 20న నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ విడుదల