Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahrukh Khan: నా కొడుకు మంచివాడిగా ఉంటె ఇంట్లోంచి తరిమేస్తాను.. పాపం షారూక్.. అప్పుడు సరదాగా అన్న మాట.. ఇప్పుడు నిజమైంది!

సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ కేసులో ప్రస్తుతం అతను ఎన్సీబీ అదుపులో ఉన్నాడు.

Shahrukh Khan: నా కొడుకు మంచివాడిగా ఉంటె ఇంట్లోంచి తరిమేస్తాను.. పాపం షారూక్.. అప్పుడు సరదాగా అన్న మాట.. ఇప్పుడు నిజమైంది!
Sharukh Khan Son Arrest
Follow us
KVD Varma

|

Updated on: Oct 03, 2021 | 6:40 PM

Shahrukh Khan: సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ కేసులో ప్రస్తుతం అతను ఎన్సీబీ అదుపులో ఉన్నాడు.  అయితే, ఈ సందర్భంగా గతంలో షారూఖ్ తన కుమారుడి గురించి సరదగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  తన కొడుకు డ్రగ్స్ తీసుకోవాలనీ.. సెక్స్ అనుభవించాలనీ షారూఖ్ ఆ సమయంలో అన్నారు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అసలు షారూఖ్ ఏ సందర్భంలో ఏమన్నారంటే..

షారుఖ్ ఖాన్ 1997 లో తన భార్య గౌరీ ఖాన్‌తో కలిసి సిమి గ్రెవాల్ షోకి వెళ్లాడు. ఈ సమయంలో, షారుఖ్ తన యవ్వనంలో చేయలేని చెడు పనులన్నీ తన కొడుకు చేయాల్సిందేనని సరదాగా చెప్పాడు. షారుఖ్, ‘నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్ చేయాలని, సెక్స్.. డ్రగ్స్‌ని కూడా ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. అతను చెడ్డ అబ్బాయి అవుతాడు.  అతను మంచి అబ్బాయిలా కనిపించడం మొదలుపెడితే, నేను అతన్ని ఇంటి నుండి తరిమేస్తాను. ‘ షారుఖ్ ఖాన్ సరదాగా చెప్పిన అదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్విట్టర్ లో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ లో షారూక్ చెప్పిన మాటల వీడియో చూడండి..

చూశారుగా.. అందుకే మన పెద్దలు తథాస్తు దేవతలు ఉంటారు అని అంటారు. షారూఖ్ నిజానికి ఈ మాటలు సరదాగా అన్నారు. కానీ ఇప్పుడు అవి నిజం అయ్యాయి.

ఆర్యన్ ఫోన్‌ను ఎన్‌సిబి స్వాధీనం చేసుకుంది

క్రూయిజ్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నందుకు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సిబి అదుపులోకి తీసుకుంది. అతని మొబైల్ జప్తు చేశారు. ఆర్యన్ మొబైల్‌లో చాట్ చేయడంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆర్యన్‌తో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు  అమ్మాయిలు ఉన్నారు. ఈ సందర్భంలో, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమిచ, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, మోహ్క్ జస్వాల్‌ని ఎన్‌సిబి విచారించింది. ముంబైలోని జెజె హాస్పిటల్‌లో వైద్య పరీక్షల అనంతరం అందరినీ ముంబైలోని ఖిలా కోర్టులో హాజరుపరుస్తారు. ఢిల్లీకి చెందిన ఒక పెద్ద పారిశ్రామికవేత్త అమ్మాయి కూడా ఇందులో పాల్గొన్నట్లు తెలిసింది.

ముంబై నుండి గోవా వెళ్లే క్రూయిజ్‌పై ఎన్సీబీ (NCB) నిర్వహించిన దాడులలో ముంబై నుండి గోవా వరకు క్రూయిజ్ కనుగొనబడింది, హషిష్, ఎండి, కొకైన్ పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.  మూడు రోజుల క్రితం ఎన్సీబీకి ఈ డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం వచ్చింది. ఈ పార్టీలో చేరడానికి, 80 వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ సమాచారం ఆధారంగా, కొంతమంది ఎన్సీబీ అధికారులు పార్టీలో చేరే సాకుతో క్రూయిజ్‌లోకి ప్రవేశించారు. లోపలి దృశ్యాన్ని చూసిన తర్వాత, ఈ బృందం బయట కూర్చున్న అధికారులకు సమాచారం అందించింది. దీని తర్వాత ఎన్సీబీ బృందం శనివారం రాత్రి దాడి చేసింది.

Also Read: Hyderabad Traffic: అక్టోబర్‌ 4 నుంచి 7 వరకు ట్రాఫిక్‌ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్‌.. ఈ వార్తపై పోలీసులు ఏమని స్పందించారంటే.

PM Narendra Modi: విమర్శలు వేరు.. ఆరోపణలు వేరు.. పదవులకన్నా ప్రజా సేవే ముఖ్యం: ప్రధాని మోదీ