Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫ్యాన్స్‌కు సుకేష్ చంద్రశేఖర్ బంపరాఫర్.. గిఫ్ట్స్‌గా 25 కార్లు, 200 ఐఫోన్లు.. ఎందుకంటే?
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు. శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే బీటౌన్ లో స్టార్ డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో స్టార్ హీరోల ప్రాజెక్టులు ఉన్నాయి.
బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్ వివాదంలో చిక్కుకుంది. మనీలాండరింగ్ కేసులో ఇప్పుడు సుకేష్ చంద్రశేఖర్ జైల్లో ఉన్నాడు. అయినా జాక్వెలిన్ ను వెంటాడుతూనే ఉన్నాడు. తరచుగా జైలు నుండి జాక్వెలిన్ కు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. ఇక దీపావళి పండుగ ను పురస్కరించుకుని తన ప్రియురాలి కోసం కొత్త లేఖ రాశాడు సుకేష్. ఆశ్చర్యకరంగా ఈసారి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అభిమానులకు కూడా ఖరీదైన బహుమతులు ఇస్తానని సుకేష్ చంద్రశేఖర్ ప్రకటించాడు . తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొత్త పాటను విడుదల చేసింది. యూట్యూబ్‌లో ఈ పాటను కామెంటు, లైకులు ,షేర్స్ చేసే అభిమానులకు సుకేష్ చంద్రశేఖర్ 25 మహీంద్రా థార్ కార్లు, 200 ఐఫోన్ 16 ప్రోలను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. దీనిని చూసి జనాలు పిచ్చిపిచ్చిగా నవ్వుకుంటున్నారు. కాగా గతంలో సుకేష్ చంద్రశేఖర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వ వైరల్‌గా మారాయి. ఆ తర్వాత జైలు నుంచి ఎన్నో లేఖలు రాశాడు. ప్రస్తుత లేఖలో జాక్వెలిన్ గురించి ప్రేమగా మాట్లాడాడు. అంతేకాదు సుకేష్ చంద్రశేఖర్ తనను రాముడిగా, జాక్వెలిన్ సీతగా అభివర్ణించాడు.
ఇదిలా ఉంటే త్వరలో తనకు బెయిల్ వస్తుందని సుఖేష్ చంద్రశేఖర్ భావిస్తున్నారు. అందుకే రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చినట్లే తాను కూడా జైలు నుంచి వస్తానని లేఖలో రాశాడు. ‘ప్రజలు నన్ను పిచ్చోడు అనుకుంటోంది. అయితే ఈ ప్రపంచానికి నా గురించి, మీ గురించి ఏమి తెలుసు? మన ప్రేమ యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. మొత్తానికి ఈ సరికొత్త ప్రేమ లేఖ, అందులోని మాటలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
View this post on Instagram
కాగా సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు సార్లు విచారించింది. 2022లో దాఖలు చేసిన ED ఛార్జ్ షీట్ ప్రకారం. సుకేష్ జాక్వెలిన్‌కు బహుమతులు కొనడానికి అక్రమ డబ్బును ఉపయోగించాడు. అదనంగా, సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి బాహుబలి నటి నోరా ఫతేహిని కూడా ప్రశ్నించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.