Mumbai Drug Case: కింగ్ ఖాన్‌కు బిగ్ షాక్.. బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేయడంతో.. తీవ్ర నిరాశలో షారుక్ ఖాన్..
బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పలువురు సినిమాతారలు ఈ కేసులో చిక్కుకున్నారు.
Drug Case: బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పలువురు సినిమాతారలు ఈ కేసులో చిక్కుకున్నారు. బాలీవుడ్ బడా హీరో కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సముద్రం మధ్యలో క్రూయిజ్ రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్యన్‌ఖాన్‌ను ప్రశ్నిస్తున్నారు NCB అధికారులు. ఆ క్రూయిజ్‌లో డ్రగ్స్‌తో దొరికిపోయాడు ఆర్యన్‌ఖాన్. ఆర్యన్‌ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్, నుపూర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాను ఎన్సీబీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై ఎటూ తేల్చకుండానే ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు విచారణను ముగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అక్టోబర్ 20వ తారీఖున తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఆర్యన్ ఖాన్ కు మరో వారం రోజుల పాటు జైల్లోనే గడపాల్సి ఉంటుంది.
ఎన్సీబీ ఆర్యన్, మరొక నిందితుడు అర్బాజ్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఎన్సీబీ కోర్టులో వాట్సాప్ చాట్ కూడా సమర్పించింది. ఈ చాట్ దర్యాప్తులో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ముఖ్యమైన పాత్ర ఉందని తేలిందని పేర్కొన్నారు. వారందరూ రేవ్ పార్టీలో ఉన్నందున వారి కేసును ఒంటరిగా పరిగణించలేమని ఎన్సీబీ చెప్పింది. ఆర్యన్ తరపు న్యాయవాది తన క్లయింట్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 20న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. దీంతో, అప్పటి వరకు ఆర్యన్ జైల్లోనే ఉండనున్నాడు. దాంతో షారుక్ ఖాన్‌కు కోలుకోలేని షాక్ తగిలినట్టైంది. ఇప్పటికే కొడుకు అరెస్ట్ తో కుంగిపోయిన షారుక్. ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. నిన్నటి వరకు బెయిల్ వస్తుందని అంతా అనుకున్నప్పటికీ కోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో ఒక్కసారిగా షారుక్ ఫ్యామిలీతోపాటు అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :