AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan: జైలులో ఖర్చుల కోసం ఆర్యన్‌కు రూ.4,500 మనియార్డర్.. వీడియో కాన్ఫరెన్స్‌లో కన్నీటి పర్యంతం

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అక్టోబర్‌ 20వ తేదీ వరకు తీర్పును రిజర్వ్‌లో పెట్టారు న్యాయమూర్తి.

Aryan Khan: జైలులో ఖర్చుల కోసం ఆర్యన్‌కు రూ.4,500 మనియార్డర్.. వీడియో కాన్ఫరెన్స్‌లో కన్నీటి పర్యంతం
Aryan Khan
Ram Naramaneni
|

Updated on: Oct 15, 2021 | 12:47 PM

Share

డ్రగ్స్ కేసులో ముంబై జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు.. తన తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించారు. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా కన్నీటి పర్యంతమైనట్టుగా తెలుస్తోంది. జైలులో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే వెసులు బాటు ఉంటుంది. అలాగే ఆర్యన్‌కు కూడా వీడియో కాన్ఫరెన్స్ అవకాశం కల్పించారు. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అక్టోబర్‌ 20వ తేదీ వరకు తీర్పును రిజర్వ్‌లో పెట్టారు న్యాయమూర్తి. దీంతో ఆర్యన్‌ మరో ఐదు రోజుల పాటు ఆర్ధర్‌ రోడ్‌ జైలులో ఉచలు లెక్క పెట్టాల్సిందే. ఆర్యన్‌ఖాన్‌కు జైలులో క్యాంటీన్‌ ఖర్చుల కోసం రూ.4,500 రూపాయలను వాళ్ల కుటుంబీకులు జైలుకు మనియార్డర్‌ చేశారు. అక్టోబర్ 11న షారుక్​ కుటుంబం మనియార్డర్ చేసినట్లు తెలిపారు జైలు సూపరింటెండెంట్‌ నితిన్ వేచల్. జైలు రూల్స్ ప్రకారం జైలు లోపలున్న వారు ఖర్చుల కోసం గరిష్టంగా 4,500 రూపాయల మనియార్డర్‌ పొందవచ్చని వెల్లడించారు. కాగా ఆర్యన్ ఖాన్‌కు ఖైదీ నంబర్ N956 కేటాయించినట్లు తెలుస్తోంది.

కరోనా పరీక్షల్లో ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్‌కు నెగెటివ్‌ రావడంతో సాధారణ సెల్‌కు తరలించారు. అక్టోబర్‌ రెండో తేదీన ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్‌ పార్టీలో పట్టుబడ్డాడు ఆర్యన్‌. అతని బెయిల్‌ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు కూడా ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను మరోసారి వ్యతిరేకించారు ఎన్సీబీ తరపు న్యాయవాది. అయితే ఎన్పీబీ ఆరోపణలను ఆర్యన్‌ తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సెలబ్రిటీల పిల్లలైన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదని చట్టంలో ఎక్కడ లేదని కౌంటరిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తీర్పును ఈనెల 20వ తేదీ వరకు రిజర్వ్‌లో పెట్టారు.

Also Read:  భర్త కనిపించడం లేదని భార్య కంప్లైంట్.. విచారణలో నిజాలు తెలిసి పోలీసులు షాక్

క్షణికావేశం.. భర్త పండుగకు ఊరికి రానన్నాడని… భార్య సూసైడ్