Hyderabad: భర్త కనిపించడం లేదని భార్య కంప్లైంట్.. విచారణలో నిజాలు తెలిసి పోలీసులు షాక్

వివాహిత మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. ఇంట్లో గొడవలయ్యాయి. ఆపై ఆమె ఊహించని నిర్ణయం తీసుకుంది.

Hyderabad: భర్త కనిపించడం లేదని భార్య కంప్లైంట్.. విచారణలో నిజాలు తెలిసి పోలీసులు షాక్
Wife Kills Husband
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 15, 2021 | 12:34 PM

వివాహిత మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. ఇంట్లో గొడవలయ్యాయి. దీంతో భర్త టార్చర్ తట్టుకోలేకపోతున్నానంటూ విషయం ప్రియుడికి తెలిపింది సదరు వివాహిత. ఇంకెముంది ఇద్దరూ అతడ్ని పక్కా స్కెచ్‌తో చంపేశారు. ఆ తర్వాత ఏమి ఎరగనట్టు ఆమె తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తేడా కొట్టడంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేశారు. దీంతో వీరి బాగోతం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే..  నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్‌ శేఖర్‌(30)కు అదే ఏరియాకు చెందిన జ్యోతి(26)కి పదేళ్ల క్రితం పెళ్లైంది. ఈ జంటకు ముగ్గురు సంతానం. ఈ కుటుంబం బ్రతుకుతెరువు కోసం మూడేళ్ల కిందట గచ్చిబౌలి గోపన్‌పల్లి తండాకు వచ్చింది. శేఖర్‌ మేస్త్రీగా పనిచేస్తుండగా.. జ్యోతి కూలీ పనులకు వెళ్తుండేది. ఇక్కడే వీరి జీవితాల్లోకి ఓ వ్యక్తి ఎంటరయ్యాడు. రామచంద్రాపురం ఉస్మాన్‌నగర్‌కు చెందిన దుడ్డెల మాణిక్యం(42) తెల్లాపూర్‌ రాజీవ్‌రెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా వర్క్ చేస్తున్నాడు. రాజీవ్‌రెడ్డి ఇటీవల తెల్లాపూర్‌లో రెండు విల్లాలు కొనుగోలు చేశాడు. వాటిలో క్లీనింగ్ సహా ఇతర పనులు చేసేందుకు మాణిక్యం గోపన్‌పల్లి తండా నుంచి కూలీలను తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలోనే శేఖర్‌ దంపతులు కూడా పలుమార్లు విల్లాల్లో పనికి వెళ్లారు. ఈ క్రమంలో వీరికి మాణిక్యంతో పరిచయం ఏర్పడింది. మాణిక్యం, శేఖర్ మద్యం సేవించేవారు కావడంతో.. వీరిద్దరికీ ఫ్రెండ్షిప్ కుదిరింది. కలిసి డైలీ మద్యం తాగేవారు. అయితే మాణిక్యం.. శేఖర్‌ భార్య జ్యోతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరి బాగోతం తెలియడంతో.. శేఖర్‌ పలుమార్లు హెచ్చరించినా ఇద్దరిలో మార్పు రాలేదు. ఈ విషయంపైనే శేఖర్‌ తరుచూ భార్యతో గొడవపడేదాడు. ఆమెను కొడుతుండేవాడు. దీంతో ప్రియుడితో కలిసి అతడిని ఫినిష్ చేయాలని జ్యోతి నిర్ణయించుకుంది. ప్లాన్‌లో భాగంగా ఈనెల 10న సాయంత్రం 6 గంటలకు మాణిక్యం.. శేఖర్‌కు ఫోన్‌ చేసి మద్యం తాగేందుకు పిలిచాడు. అప్పటికే  పురుగుమందు కలిపిన మద్యాన్ని తాగించాడు. అనంతరం గొడ్డలితో నరికి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం తన భర్త కనిపించడం లేదంటూ జ్యోతి బంధువులకు సమాచారం ఇచ్చింది. వారు గచ్చిబౌలి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు రంగనాథ్‌ నగర్‌లో శేఖర్‌ డెడ్‌బాడీని గుర్తించారు.

విచారణలో జ్యోతి, మాణిక్యం అక్రమ సంబంధం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: Telangana: క్షణికావేశం.. భర్త పండుగకు ఊరికి రానన్నాడని… భార్య సూసైడ్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!