AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Kundra Case: కొత్త చిక్కుల్లో రాజ్ కుంద్రా.. ఫిర్యాదు చేసిన మరో బాలీవుడ్ భామ..!

పోర్న్ చిత్రాల నిర్మాణం, కంటెంట్ ఆరోపణలపై రాజ్ కుంద్రా చాలా కాలంగా ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కొన్ని వారాల విచారణ తరువాత ఆ‍యన్ను బెయిల్‌పై విడుదలచేశారు. రాజ్ కుంద్రా ప్రస్తుతం తన ఇంటిలో ఉన్నాడు. కేసు విచారణను ఎదుర్కొంటున్నాడు.

Raj Kundra Case: కొత్త చిక్కుల్లో రాజ్ కుంద్రా.. ఫిర్యాదు చేసిన మరో బాలీవుడ్ భామ..!
Sherlyn Chopra
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 14, 2021 | 3:34 PM

Share

Raj Kundra: పోర్న్ చిత్రాల నిర్మాణం, కంటెంట్ ఆరోపణలపై రాజ్ కుంద్రా చాలా కాలంగా ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కొన్ని వారాల విచారణ తరువాత ఆ‍యన్ను బెయిల్‌పై విడుదలచేశారు. రాజ్ కుంద్రా ప్రస్తుతం తన ఇంటిలో ఉన్నాడు. కేసు విచారణను ఎదుర్కొంటున్నాడు. అయితే తాజాగా ఆయనకు మరిన్ని కొత్త చిక్కులు రానున్నట్లు తెలుస్తోంది. మోడల్ షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుహు పోలీస్ స్టేషన్‌‌లో ఈ మేరకు ఆమె రాజ్‌కుంద్రాపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేయడానికి మోడల్ షెర్లిన్ చోప్రా తన న్యాయవాదులతో కలిసి ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

తనతో పనిచేయించుకుని రాజ్ కుంద్రా ఇంకా డబ్బు ఇవ్వలేదని షెర్లిన్ చోప్రా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.

వేధింపుల ఆరోపణలు.. షెర్లిన్ చోప్రా శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ముద్దుపెట్టుకోవడం లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను వయోజన పరిశ్రమలోకి తీసుకువచ్చింది రాజ్ కుంద్రానే అని షెర్లిన్ పేర్కొంది. 2019 నుంచి ఆమె రాజ్ కుంద్రాతో పోర్న్ కంటెంట్‌ను తయారుచేయడంలో సహాయపడుతోంది. ఈ సమయంలో రాజ్ కుంద్రా ఒకసారి తన ఇంట్లోకి ప్రవేశించి, బలవంతం చేసేందుకు ప్రయత్నించాడని ఆమె పేర్కొంది.

ఎఫ్ఐఆర్ నమోదు.. రాజ్ కుంద్రాపై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత, ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులకు ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో రాజ్‌పై బలమైన ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై విచారణ జరిపిన తర్వాత రాజ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్ కుంద్రా.. పోర్న్ చిత్రాల నిర్మాణం, కంటెంట్ ఆరోపణలపై రాజ్ కుంద్రా చాలాకాలంగా ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి చాలా వారాల పాటు విచారించారు. ఆ తర్వాత బెయిల్‌పై రాజ్ కుంద్రా విడుదలయ్యాడు. అతను ప్రస్తుతం తన ఇంటిలో ఉంటున్నాడు. కేసు విచారణను ఎదుర్కొంటున్నాడు. మోడళ్ల ఫిర్యాదును స్వీకరించిన తర్వాత పోలీసులు రాజ్ కుంద్రాపై దర్యాప్తు ప్రారంభించారు.

పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాను పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్టు చేసిన విషయం తెలసిందే. వారు తమ సహచరుల సహాయంతో పోర్న్ సినిమాలను షూట్ చేసి, వారి కంటెంట్‌ని విభిన్న కంపెనీలకు అమ్మి భారీ మొత్తాన్ని సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే శిల్పా శెట్టి, ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, రాజ్ కుంద్రాపై ఆరోపణల గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని పేర్కొనడం విశేషం.

Also Read: Manchu Vishnu: బాలయ్య సలహా.. ఇప్పుడు నా అజెండే అదేనన్న మంచు విష్ణు

Maha Samudram Review: ప్రేమ… స్నేహం… బంధం… బాధ్యతల కలయిక ‘మహా సముద్రం’