Shah Rukh Khan: మరొక్క ఛాన్స్.. డైరెక్టర్‌ను స్టేజ్ మీదే బ్రతిమాలిన షారుఖ్.. మణిరత్నం ఫన్నీ ఆన్సర్..
ఒక్క సంవత్సరంలోనే ఏకంగా రూ.2 వేల కోట్లకు పైగా సంపాదించి గత రికార్లను బ్రేక్ చేశాడు. దీంతో బాద్ షా ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక డిసెంబర్ చివర్లో విడుదలైన డంకీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ ఈ సినిమాకు కొద్ది మేర మంచి వసూళ్లే వచ్చాయి.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేసిన ఈ హీరో.. గతేడాది మాత్రం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. షారుఖ్ నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఒక్క సంవత్సరంలోనే ఏకంగా రూ.2 వేల కోట్లకు పైగా సంపాదించి గత రికార్లను బ్రేక్ చేశాడు. దీంతో బాద్ షా ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక డిసెంబర్ చివర్లో విడుదలైన డంకీ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.. కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ ఈ సినిమాకు కొద్ది మేర మంచి వసూళ్లే వచ్చాయి. ఆ మరుసటి రోజే ప్రభాస్ నటించి సలార్ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో అటు డంకీ చిత్రానికి కలెక్షన్స్ తగ్గాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదున్న షారుఖ్.. తనకు మరొక్క ఛాన్స్ ఇవ్వాలని… తనతో మళ్లీ ఓ సినిమా చేయాలని ఓ దర్శకుడిని బ్రతిమాలాడు. తనతో మరోసారి ఓ సూపర్ హిట్ చేయాలని అందరి ముందే స్టేజ్ పై ఆ దర్శకుడిని కోరాడు. అయితే తను ఫ్లైట్ కొన్న తర్వాతే బాద్ షాతో సినిమా చేస్తానని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు డైరెక్టర్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా… అతడే మణిరత్నం. ఎన్నో క్లాసిక్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి స్టార్ హీరోల ఖాతాలో సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్. గతంలో మణిరత్నం, షారుఖ్ కాంబోలో వచ్చిన దిల్ సే సినిమా గురించి చెప్పక్కర్లేదు. అప్పట్లో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ మ్యూజిక్ ప్రియులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమా తర్వాత తనతో మళ్లీ ఓ సినిమా చేయాలని చాలా ఏళ్లుగా అడుగుతున్నారట షారుఖ్. కానీ మణిరత్నం ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తాజాగా మరోసారి అడిగాడు షారుఖ్.
ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో షారుఖ్, మణిరత్నం మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ నవ్వులు పూయిస్తుంది. దిల్ సే తర్వాత నాతో సినిమా చేయాలని అడుగుతూనే ఉన్నాను. కానీ ఇంతవరకు చేయలేదు. మణిసర్ మిమ్మల్ని ఎన్నిసార్లు అడుక్కున్నాను. మళ్లీ నాతో సినిమా చేయమని అడిగాను. బెగ్గింగ్ చేశాను. ఈసారి మీరు సినిమా చేస్తే ట్రైన్ లో ఏంటీ.. ప్లేన్ మీద చయ్యా చయ్యా అని డాన్స్ చేస్తాను అని అన్నాడు షారుఖ్. నేను ప్లెయిన్ కొన్న తర్వాత చేస్తా అని మణిరత్నం అనగానే నేను ప్లెయిన్ కొంటే ఓకేనా ?అని మళ్లీ అడిగాడు షారుఖ్. ఓకే అని మణి అనగానే.. త్వరలోనే కొనేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు షారుఖ్. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.