Abbas Daughter Emira Ali: వాటే అందం..! హీరోయిన్లను మించిన బ్యూటీతో హీరో అబ్బాస్ కూతురు.

Abbas Daughter Emira Ali: వాటే అందం..! హీరోయిన్లను మించిన బ్యూటీతో హీరో అబ్బాస్ కూతురు.

Anil kumar poka

|

Updated on: Jan 11, 2024 | 11:53 AM

ఒకప్పుడు అమ్మాయిల రాజకుమారుడు అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు హీరో అబ్బాస్. 1996లో వచ్చిన ప్రేమ దేశం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో అబ్బాస్. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ.. ప్రేమదేశం సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు ఈ లవర్ బాయ్. చివరిగా 2009లో వచ్చిన బ్యాంక్ అనే సినిమాలో కనిపించారు అబ్బాస్. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన ఈయన తెలుగు, తమిళ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

ఒకప్పుడు అమ్మాయిల రాజకుమారుడు అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు హీరో అబ్బాస్. 1996లో వచ్చిన ప్రేమ దేశం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో అబ్బాస్. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అబ్బాస్ అసలు పేరు మీర్జా అబ్బాస్ అలీ.. ప్రేమదేశం సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు అబ్బాస్. తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు ఈ లవర్ బాయ్. చివరిగా 2009లో వచ్చిన బ్యాంక్ అనే సినిమాలో కనిపించారు అబ్బాస్. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన ఈయన తెలుగు, తమిళ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 50 సినిమాలకు పైగా నటించిన అబ్బాస్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

అబ్బాస్ సినిమాల నుంచి దూరం అయిన తర్వాత ఫ్యామిలీతో న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. అక్కడ ఆయన ఓ మోటివేషనల్ స్పీకర్ గా పని చేస్తున్నాడు. గతంలో అడపాదడపా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన లైఫ్ ఏర్పాటు చేసుకున్నాడు అబ్బాస్. ఇప్పుడు ఫ్యామిలీతో దూరంగా బ్రతుకుతున్నారు. ఇదిలా ఉంటే అబ్బాస్ కూతురి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అబ్బాస్ ఫ్యాషన్ డిసైనర్ గా వర్క్ చేసిన ఇరుం అలీ అబ్బాస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అబ్బాస్ ఫ్యామిలీ గురించి చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు. అబ్బాస్ లాగానే అతని భార్య పిల్లలు కూడా చాల అందంగా ఉంటారు. అబ్బాస్ కూతురు ఏమిరా అలీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది ఏమిరా అలీ. ఈ అమ్మడిని చూసిన ప్రేక్షకులు హీరోయిన్ గా అడుగు పెడితే సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos