Salman Khan: సల్మాన్ ఖాన్ కొత్త డైమండ్ వాచ్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఇప్పుడున్న అత్యధిక సంపాదన కల్గిన స్టార్ హీరోలలో సల్మాన్ ఒకరు. కేవలం సినిమాలే కాకుండా వ్యాపార రంగంలో.. యాడ్స్ లో సల్మాన్ సంపాదన ఎక్కువే ఉంటుంది. ఇప్పటివరకు సల్మాన్ కార్స్ కలెక్షన్స్, ముంబైలో అతని నివాసంకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అలాగే సల్మాన్ కు లగ్జరీ వాచ్ లు అంటే చాలా ఇష్టం. తన జీవితంలో ఎన్నో ఉత్తమమైన.. లగ్జరీ గడియారాలను ధరించాడు. తాజాగా సల్మాన్ ఖాన్ కొత్త డైమండ్ వాచ్ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

Salman Khan: సల్మాన్ ఖాన్ కొత్త డైమండ్ వాచ్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Salman Khan
Follow us

|

Updated on: Nov 16, 2023 | 6:42 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు. ఇటీవలే టైగర్ 3 చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాకుండా.. బాలీవుడ్ భాయిజాన్ తన విలాసవంతమైన కార్లు, విశాలమైన ఫామ్‌హౌస్ వరకు ఎంతో లగ్జరీ జీవనశైలికి ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడున్న అత్యధిక సంపాదన కల్గిన స్టార్ హీరోలలో సల్మాన్ ఒకరు. కేవలం సినిమాలే కాకుండా వ్యాపార రంగంలో.. యాడ్స్ లో సల్మాన్ సంపాదన ఎక్కువే ఉంటుంది. ఇప్పటివరకు సల్మాన్ కార్స్ కలెక్షన్స్, ముంబైలో అతని నివాసంకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అలాగే సల్మాన్ కు లగ్జరీ వాచ్ లు అంటే చాలా ఇష్టం. తన జీవితంలో ఎన్నో ఉత్తమమైన.. లగ్జరీ గడియారాలను ధరించాడు. తాజాగా సల్మాన్ ఖాన్ కొత్త డైమండ్ వాచ్ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

ఇటీవల సల్మాన్ తన సోదరి అర్పితా ఖాన్, బావ ఆయుష్ శర్మ దీపావళి పార్టీలో పాల్గొన్నారు. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ సాంప్రదాయ లుక్‏లోనే కాకుండా.. మరింత స్టైలీష్ లుక్ లో కనిపించారు. బ్లాక్ అవుట్ ఫిట్ లో ఎంతో స్టైలీష్ గా కనిపించారు సల్మాన్. అదే సమయంలో సల్మాన్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇప్పుడు ఆ వాచ్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాడు. సల్మాన్ పెట్టుకున్న ఆ డైమండ్ వాచ్ రోలెక్స్ బ్రాండ్ కు చెందినది.

ఇవి కూడా చదవండి

ది ఇండియన్ హారాలజీ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ప్రకారం.. రోలెక్స్ స్కై-డ్వెల్లర్ మెటోరైట్ బ్రాండ్ కు చెందిన ఆ వాచ్ విలువ రూ. 2.9 కోట్లు అని సమాచారం. సల్మాన్ వాచ్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన టైగర్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సల్మాన్. ఇందులో కత్రీనా కైఫ్ నటించింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. దీనికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..
రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..
లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు
లక్కీ ఛాన్స్ అంటే వీళ్లదే గురూ..! భార్యభర్తలకు ఆరు మద్యం దుకాణాలు
పంట పొలాల్లో పాదముద్రలు.. భయం గుప్పెట రైతులు!
పంట పొలాల్లో పాదముద్రలు.. భయం గుప్పెట రైతులు!
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి దూసుకొస్తున్న నయా మాల్‌
కొత్త ఫోన్‌ కొంటున్నారా.? మార్కెట్లోకి దూసుకొస్తున్న నయా మాల్‌
యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కుటుంబం
యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత.. కన్నీరుమున్నీరైన కుటుంబం
మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు
మూసీ పరివాహాక ప్రజలకు అలర్ట్‌.. తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు
ఆ చిన్నారి ఇంత వయ్యారంగా మారిపోయింది..
ఆ చిన్నారి ఇంత వయ్యారంగా మారిపోయింది..
వాటే సింప్లిసిటీ.. ఈ ప్రధాని పనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే
వాటే సింప్లిసిటీ.. ఈ ప్రధాని పనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే
అపర్ణ ప్లాన్ సక్సెస్.. రుద్రాణి మాస్టర్ ప్లాన్.. బయటపడిన నిజం!
అపర్ణ ప్లాన్ సక్సెస్.. రుద్రాణి మాస్టర్ ప్లాన్.. బయటపడిన నిజం!
రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..? అతిగా తింటే అనర్థాలే సుమీ..!
రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..? అతిగా తింటే అనర్థాలే సుమీ..!