- Telugu News Photo Gallery Cinema photos Bollywood Hero Salman Khan Tiger 3 Movie Box Office Collection Update Telugu Entertainment Photos
Salman Khan – Tiger 3: వసూళ్ల వేటలో వెనకబడిన టైగర్ 3.? సల్మాన్ రిస్క్ చేసారా..?
సల్మాన్ ఖాన్ తెలిసి తెలిసి రిస్క్ చేసారా..? టైగర్ 3కి అది నష్టం చేస్తుందని తెలిసినా కూడా వెనక్కి తగ్గలేదా.. మొండి ధైర్యంతో ముందుకు వెళ్లి ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారా..? చేతుల్లో ఉన్న సినిమాను.. చేతులారా వదిలేసుకున్నారా..? అసలేంటి కండలవీరుడికి వచ్చిన కష్టం..? అసలు ఆయన లేటెస్ట్ సినిమా టైగర్ 3 పరిస్థితేంటి..? మిగిలిన స్పై సినిమాలను బీట్ చేస్తుందా లేదా..? బాలీవుడ్‌లో స్పై సినిమాల టైమ్ నడుస్తుంది.
Updated on: Nov 16, 2023 | 7:07 PM

సల్మాన్ ఖాన్ తెలిసి తెలిసి రిస్క్ చేసారా..? టైగర్ 3కి అది నష్టం చేస్తుందని తెలిసినా కూడా వెనక్కి తగ్గలేదా.. మొండి ధైర్యంతో ముందుకు వెళ్లి ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారా..? చేతుల్లో ఉన్న సినిమాను.. చేతులారా వదిలేసుకున్నారా..?

అసలేంటి కండలవీరుడికి వచ్చిన కష్టం..? అసలు ఆయన లేటెస్ట్ సినిమా టైగర్ 3 పరిస్థితేంటి..? మిగిలిన స్పై సినిమాలను బీట్ చేస్తుందా లేదా..? బాలీవుడ్‌లో స్పై సినిమాల టైమ్ నడుస్తుంది.

ఇది మనం చెప్పే మాట కాదు.. బాక్సాఫీస్ దగ్గర ఫిగర్స్ చెప్తున్న మాట. తాజాగా విడుదలైన సల్మాన్ ఖాన్ టైగర్ 3 కూడా మూడు రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేసింది.

అయితే పఠాన్, జవాన్‌తో పోల్చి చూసినపుడు మాత్రం చాలా వెనకబడ్డారు కండలవీరుడు. ఆదివారం రిలీజ్ టైగర్ 3కి మైనస్ అయిందనేది ట్రేడ్ నుంచి వస్తున్న మాట. సాధారణంగా సినిమాలేమైనా శుక్రవారాలు విడుదలవ్వడం అనేది కామన్..

పండగ సీజన్ ఉంటే గురువారమే తీసుకొస్తుంటారు. కానీ టైగర్ 3 మాత్రం అటూ ఇటూ కాకుండా ఆదివారం వచ్చింది. దాంతో ముందు రెండు రోజులు పోయింది.. దానికితోడు వరల్డ్ కప్ ఫీవర్ కూడా సల్మాన్ సినిమాకు శాపంగా మారింది.

దాంతో నాలుగో రోజుకే కలెక్షన్స్ సగానికి సగం పడిపోయాయి. సెమీస్, ఫైనల్ మ్యాచులు ఉండటంతో ఈ వారమంతా వరల్డ్ కప్ ఫీవర్ ఉంటుంది. ఇండియా ఫైనల్ చేరితే.. టైగర్ 3కి మరో సండే కూడా శాపమే.

అన్నింటికి మించీ రొటీన్ యాక్షన్ సినిమా అనేది టైగర్ 3పై ఉన్న టాక్. ఇవన్నీ వార్, పఠాన్ కంటే సల్మాన్ ఖాన్ సినిమాను వెనక్కి నెట్టేసాయి. రాబోయే రోజులన్నీ టైగర్ 3కి కీలకమే. మరి వాటిని వాడుకుని.. 500 కోట్ల క్లబ్‌లో చేరుతుందా లేదా అనేది చూడాలిక.





























