- Telugu News Photo Gallery Cinema photos Tollywood big movies to release for Sankranti 2024 Updates Here Telugu Entertainment Photos
Sankranti 2024 Movies: అందరి చూపు సంక్రాంతి వైపే.! అరడజనుకుపైగా సినిమాలు మరి…
సంక్రాంతికి ఎవరికి వాళ్లు మేమొస్తాం అని ముందుగా చెప్పారు కానీ చివరి వరకు ఎవరు రేసులో ఉంటారులే.. ఎవరో ఒకరిద్దరు కచ్చితంగా బయటికి వచ్చేస్తారులే అని అనుకున్నారంతా. కానీ అదేం జరిగేలా కనిపించడం లేదు.. చూస్తుంటే చెప్పినోళ్లు చెప్పినట్లు పండక్కి వచ్చేలా కనిపిస్తున్నారు. పొంగల్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మరి పండగ సినిమాల షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి చూద్దాం.
Updated on: Nov 16, 2023 | 5:41 PM

సంక్రాంతికి ఎవరికి వాళ్లు మేమొస్తాం అని ముందుగా చెప్పారు కానీ చివరి వరకు ఎవరు రేసులో ఉంటారులే.. ఎవరో ఒకరిద్దరు కచ్చితంగా బయటికి వచ్చేస్తారులే అని అనుకున్నారంతా. కానీ అదేం జరిగేలా కనిపించడం లేదు..

చూస్తుంటే చెప్పినోళ్లు చెప్పినట్లు పండక్కి వచ్చేలా కనిపిస్తున్నారు. పొంగల్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మరి పండగ సినిమాల షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి చూద్దాం. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా.. అందరి చూపు మాత్రం గుంటూరు కారంపైనే ఉంది.

ఎందుకంటే పండగ సినిమాల్లో సింహభాగం మహేష్ బాబుదే. కాబట్టి గుంటూరు కారం షూటింగ్ అప్‌డేట్స్‌పైనే అందరి చూపుంది. ఈ చిత్ర షూటింగ్ దీనికి తగ్గట్లుగానే జరుగుతుంది. ఓ వారం టాకీ పార్ట్.. 4 పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుందని తెలుస్తుంది. డిసెంబర్ 20న నాటికి షూటింగ్ అంతా పూర్తి చేయనున్నారు త్రివిక్రమ్.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా అంతే. ఈయన ఏకంగా గౌతమ్ తిన్ననూరి సినిమాను పక్కనబెట్టి మరీ పరశురామ్ సినిమాను పూర్తి చేస్తున్నారంటే పండగను ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతుంది.

మరోవైపు వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, తేజ సజ్జా హనుమాన్ సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకుని సేఫ్‌జోన్‌లోనే ఉన్నాయి. నాగార్జున సైతం పండక్కి రావాలని మెంటల్‌గా ఫిక్సైపోయారు.

అందుకే నా సామిరంగా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతుంది. విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ 5 నాటికి పూర్తి కానుందని తెలుస్తుంది.

4 పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. మొత్తానికి చూడాలిక.. పండగని అందరూ సీరియస్‌గానే తీసుకున్నారు.. మరి ప్రేక్షకులు ఏ సినిమాను సీరియస్‌గా తీసుకుంటారో..?





























