AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tadap Trailer: ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన అహన్ శెట్టి..

ఆర్ఎక్స్ 100 సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరో కార్తికేయ... హీరోయిన్ పాయల్

Tadap Trailer: ఆర్ఎక్స్ 100 హిందీ రీమేక్ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన అహన్ శెట్టి..
Tadap
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2021 | 1:58 PM

Share

ఆర్ఎక్స్ 100 సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరో కార్తికేయ… హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే తెలుగులో సూపర్ హిట్ అయిన ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని హిందీ రీమేక్ చేశారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు..అలాగే తారా సుతరియా హీరోయిన్‏గా నటిస్తుండగా.. మిలన్ లుత్‏రియా దర్శకత్వం వహించారు. హిందీ రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తడప్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.. తడప్ అంటే తపన అని అర్థం.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..

తాజాగా ఈ తడప్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్. అహాన్ .. నువ్వు ఎదగడం చూశాను.. ఈరోజు నీ మొదటి ప్రయత్నం ద్వారా సినీ ప్రపంచానికి నిన్ను పరిచయం చేయడం సంతోషంగా.. గౌరవంగా ఉంది.. తడప్ చిత్రయూనిట్‏కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు అమితాబ్. ఇందులో అహన్ పాత్ర కాస్త దూకుడుగా ఉన్నప్పటికీ సున్నితమైన పాత్రలో తారా కనిపించింది. ఇక ట్రైలర్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు. డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్..

Also Read: మెగాస్టార్ అభిమానులకు సర్‏ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. భోళా శంకర్ సినిమాపై అసలు క్లారిటీ ఇచ్చేశారుగా..

Bigg Boss 5 Telugu: టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీళ్లే.. కానీ విన్నర్ మాత్రం అతడే అంటోన్న..