IND vs ENG: సెంచరీతో దుమ్మురేపిన వైభవ్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
England U19 vs India U19, Final, ICC Under 19 World Cup 2026: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు ముందు 412 పరుగుల టార్గెట్ నిలిచింది.

England U19 vs India U19, Final, ICC Under 19 World Cup 2026: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ కు భారత్ 412 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. కనిష్క్ చౌహాన్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులకు అవుటయ్యాడు. 218.75 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే (53 పరుగులు) అర్ధ సెంచరీ సాధించాడు. అభిజ్ఞాన్ కుందు 40, వేదాంత్ త్రివేది 32, విహాన్ మల్హోత్రా 30 పరుగులు చేశారు.
జేమ్స్ మీటో 3 వికెట్లు పడగొట్టగా, సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
ఇరు జట్లు:
ఇంగ్లాండ్ U19 (ప్లేయింగ్ XI): బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయస్, థామస్ రెవ్ (కెప్టెన్, కీపర్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్.
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(కీపర్), అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
