Vaishali Thakkar Suicide: టీవీ నటి ఆత్మహత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు.. విచారణలో షాకింగ్ విషయాలు
రాహుల్ నవ్లానీ వైశాలీని తరచూ వేధిస్తున్నాడని, తన మృతికి కారణం అతడేనని లేఖలో పేర్కొంది. తనను పెళ్లి చేసుకోనివ్వకుండా వేధిస్తున్నాడని నోట్‌లో తెలిపింది. వైశాలి ఆత్మహత్య తర్వాత రాహుల్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ వాదనలకు బలం చేకూర్చింది.
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టీవీ నటి వైశాలి టక్కర్ ఈనెల 15న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనా స్థలంలోనే సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను వెదికే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకే ఇంటి పక్కన ఉండే రాహుల్ నవ్లానీ వైశాలీని తరచూ వేధిస్తున్నాడని, తన మృతికి కారణం అతడేనని లేఖలో పేర్కొంది. తనను పెళ్లి చేసుకోనివ్వకుండా వేధిస్తున్నాడని నోట్‌లో తెలిపింది. వైశాలి ఆత్మహత్య తర్వాత రాహుల్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఈ వాదనలకు బలం చేకూర్చింది. ఈ లేఖ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల కోసం పలుచోట్ల గాలించారు. తాజాగా ఇండోర్‌లో రాహుల్ నవ్లానీని అరెస్టు చేశారు. నటి సూసైడ్ నోట్ ఆధారంగా పొరుగున ఉన్న రాహుల్ నవ్లానీ, అతని భార్య దిశాపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా వైశాలి పెళ్లి జరుగకుండా రాహుల్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకు ముందు సైతం ఫొటోలు, వీడియోలు చూపించి కాబోయే భర్తకు పంపాడని, ఈ కారణంగానే ఆమె నిశ్చితార్థం రద్దయ్యిందని వాపోయారు. మరొకరితో వివాహం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాగే చేశాడని వైశాలి కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. కాగా వైశాలి టక్కర్ ససురాల్ సిమర్ కా, సూపర్ సిస్టర్, యే రిష్తా క్యా కెహ్లతా, యే హై ఆషికి వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..