AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవుర్రా నువ్వు..! ప్రతిసారి ఇతని ఎంట్రీ ఏంటి..!! ఓరిపై ఫైర్ అవుతున్న దీపికా ఫ్యాన్స్

తాజాగా అతను షేర్ చేసిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. సెలబ్రెటీల మీద వెరైటీగా చేయి పెట్టి ఓ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు ఇతగాడు. ఇప్పటికే బాలీవుడ్ నటీ నటులతో పాటు మొన్నీమధ్య మన టాలీవుడ్ నటి సురేఖ వాణితోనూ ఇలాంటి ఫోజే ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి ఓరి వైరల్ గా మారాడు. దానికి కారణం దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తో అతను ఇచ్చిన పోజు. దీపికా పదుకొణె ప్రస్తుతం గర్భవతి.

ఎవుర్రా నువ్వు..! ప్రతిసారి ఇతని ఎంట్రీ ఏంటి..!! ఓరిపై ఫైర్ అవుతున్న దీపికా ఫ్యాన్స్
Deepika Padukone
Rajeev Rayala
|

Updated on: Jul 11, 2024 | 11:14 PM

Share

బాలీవుడ్ సెలబ్రిటీలకు అత్యంత సన్నిహితుడైన ఓరి అలియాస్ ఓర్హాన్ అవత్రమణి ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు తాజాగా అతను షేర్ చేసిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. సెలబ్రెటీల మీద వెరైటీగా చేయి పెట్టి ఓ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇస్తాడు ఇతగాడు. ఇప్పటికే బాలీవుడ్ నటీ నటులతో పాటు మొన్నీమధ్య మన టాలీవుడ్ నటి సురేఖ వాణితోనూ ఇలాంటి ఫోజే ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి ఓరి వైరల్ గా మారాడు. దానికి కారణం దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తో అతను ఇచ్చిన పోజు. దీపికా పదుకొణె ప్రస్తుతం గర్భవతి. ఓరి ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టి ఫోటో దిగాడు. దీన్ని చూసిన నెటిజన్లు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓరి ప్రవర్తన చూసి దీపికా పదుకొణె అభిమానులు చిరాకు పడుతున్నారు.

బి-టౌన్ ప్రముఖులు ఎక్కడ పార్టీ పెట్టినా ఓరి హాజరవుతారు. పార్టీకి వచ్చే సెలబ్రిటీలందరితో ఓరి ఫోటోలు దిగుతాడు.సెలబ్రిటీలు అందరితో ఓరి ఫోటోలు దిగుతారు.. అందుకు తాజా ఉదాహరణే ఈ ఫోటో. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పార్టీలో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కూడా కనిపించారు. దీపికా బేబీ బంప్‌తో  ఓరి ఫోటో దిగాడు. ఇదంతా ఓరి మాత్రమే చేయగలడు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి దీపికా అనుమతించకుండా ఉండాల్సిందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో దీపికా పదుకొణెకు క్రేజీ డిమాండ్‌ ఉంది. ఇప్పుడు ఈ బ్యూటీ మొదటి బిడ్డ రాక కోసం ఎదురుచూస్తున్నారు. గర్భవతి కావడంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. కొన్నిరోజులుగా ఆమె సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. కొన్ని వారాల క్రితం దీపికా పదుకొణె ‘కల్కి 2989 AD’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఇప్పుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మ్యూజిక్ షోలో ఇలా మెరిసింది.

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.