AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: పగలబడి నవ్విన ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్ మాములుగా లేదుగా..వీడియో వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎక్కువైన సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు గంటలకొద్ది నెట్టింట్లో

Alia Bhatt: పగలబడి నవ్విన ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. నెటిజన్స్ ట్రోలింగ్ మాములుగా లేదుగా..వీడియో వైరల్..
Alia Bhatt
Rajitha Chanti
|

Updated on: Jan 03, 2022 | 8:05 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఎక్కువైన సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు గంటలకొద్ది నెట్టింట్లో మునిగి తెలుతుంటారు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో హీరోహీరోయిన్లకు సంబంధించిన విషయాలలో నెటిజన్స్ చాలా యాక్టివ్‏గా ఉంటారు. సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయంపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఇక తమ అభిమాన హీరోహీరోయిన్లకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ ను తెగ షేర్ చేస్తుంటారు. ఒకవేళకు హీరోహీరోయిన్ల ప్రవర్తనలో కాస్త తేడా ఉన్నా దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. ఇప్పటికే కియారా అద్వానీ, దీపికా పదుకునే, సారా అలీ ఖాన్ ఇలా చాలా మంది సెలబ్రెటీలు నెటిజన్స్ నుంచి చెదు అనుభవాలను ఎదుర్కోన్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‏ను నెటిజన్స్ ఓ ఆటాడుకున్నారు.

ప్రస్తుతం అలియా భట్.. జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఓమిక్రాన్, కరోనా కేసులు పెరగడం… తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ రేట్స్ వివాదం జరుగుతుండడంతో సినిమా విడుదలను వాయిదా చేసింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‏లో పాల్గోంటూ బిజీగా ఉన్న అలియా.. ఓ ఈవెంట్లో కెమెరాలకు ఫోజిలిస్తూ తెగ నవ్వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ భయానీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో రకరకాల ఫోజులకు నవ్వుతూ ఫోజిలిస్తూ కనిపించింది అలియా. ఇది చూసిన నెటిజన్స్ ఆమెది ఫేక్ నవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బలవంతంగా నవ్వుతుందని.. కావాలనే అలా చేస్తుందంటూ.. నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో హీరోయిన్ దీపికా పదుకొణెది ఫేక్ నవ్వు అంటూ అలియా కామెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.

Also Read: Kajal Aggarwal: తొలిసారి బేబి బంప్‏తో కనిపించిన కాజల్.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..