Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె..

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికర విశేషాలు మీకోసం..
Lata Mangeshkar
Follow us

|

Updated on: Feb 06, 2022 | 8:26 PM

Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఇవాళ ఉదయం 6.30 గంటలకు కన్నమూసినట్లు వైద్యులు ప్రకటించారు. లతా మంగేష్కర్ మృతితో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన అద్భుతమైన గాత్రంలో దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఇక ఆమె లేరనే వార్తను అభిమానులు జీర్ణినంచుకోలేకపోతున్నారు. ఇక లతా మంగేష్కర్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె పాడిన పాటలను గుర్తు చేస్తూ.. నివాళులర్పించారు. ఆమె అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలోని శివాజీ పార్క్‌లో నిర్వహించారు.

28 సెప్టెంబర్, 1929న జన్మించిన లతా మంగేష్కర్ 1942లో 13 ఏళ్ల వయసులో సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన లతా మంగేష్కర్ దాదాపు ఏడు దశాబ్ధాల తన కెరీర్‌లో ఎన్నో పాటలు పాడారు. దేశంలోని 36 ప్రాంతీయ భాషలలో, విదేశీ భాషలలో కూడా పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటి మహోన్నత గాయకురాలు ఇక మన మధ్య లేదనే వాస్తవాన్ని అభిమానులు ఊహించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆమె జీవన ప్రయాణం, ఆమె పాడిన పాటలు, ఆమె లైఫ్ స్టైల్, ఆమె జీవితంలోని కీలక ఘటనలు వంటివి తెరపైకి వస్తున్నాయి. లతా మంగేష్కర్ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పార్లమెంట్‌ మెంబర్.. లతా మంగేష్కర్ పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు. 1999 నుంచి 2005 వరకు రాజ్య సభ సభ్యురాలిగా ఉన్నారు. అయితే, తన పదవిపై లతా మంగేష్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన దవీకాలం అసంతృప్తకరమైనది అంటూ కామెంట్ చేశారు.

తన పాటలను ఎప్పుడూ వినరు.. లతా మంగేష్కర్ తాను పాడిన పాటలను ఎప్పుడూ వినలేదట. ఇదే విషయాన్ని ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంట్వర్యూలో ఆమె వెల్లడించారు. అలా తన పాట తాను వింటే పాటలో అనేక లోపాలు కనిపిస్తాయని, అందుకే తన పాటలను తాను వినను అని చెప్పుకొచ్చారు ఈ గానకోకిల.

తొలి పాటను తొలగించారు.. లతా మంగేష్కర్ పాడిన మొదటి పాటను సినిమా నుంచి తొలగించారు. కితి హసల్ అనే మరాఠీ చిత్రం కోసం ఆమె తన కెరీర్‌లో తొలి పాటను పాడారు. ‘‘నాచు యా గదే, ఖేలు సారీ మణి హౌస్ భారీ’’ పాట. ఈ పాట 1942లో రికార్డ్ చేశారు. కానీ ఈ పాటను సినిమా నుంచి కట్ చేశారు.

కళాకారుల కుటుంబం నుంచి వచ్చారు.. లతా మంగేష్కర్ కళాకారుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రికి ఒక థియేటర్ కూడా ఉండేది. అలా తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పాటలు పాడటం ప్రారంభించారు.

ఇష్టమైన సంగీత దర్శకుడు అతనే.. సంగీత దర్శకులలో మదన్ మోహన్ అంటే ఆమెకు ఇష్టమట. అతనితో మంచి అనుబంధం ఉందని, తాను పని చేసిన వారిలో ఉత్తమ సంగీత దర్శకుడు మదన్ మోహన్ అంటూ పలు సందర్భాల్లో లతా మంగేష్కర్ తెలిపారు.

స్పృహతప్పి పడిపోయింది.. లతా మంగేష్కర్ ఒకసారి పాటపడుతూనే స్పృహతప్పి పడిపోయింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంలో జాతీయ మీడియాకు వెళ్లడించారు. ‘‘ఆ రోజుల్లో రికార్డింగ్ స్టూడియోలలో ఎయిర్ కండీషనర్లు లేవు. ఫైనల్ రికార్డింగ్ సమయంలో ఫ్యాన్లు కూడా ఆపేశారు. దాంతో తాను పాట పాడుతూనే స్పృహతప్పి పడిపోయాను.’’ అని చెప్పారు లత.

గిన్నీస్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక పాటలు పాడిన సింగర్‌గా లతా మంగేష్కర్ 1974లో ది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

ఒపి నయ్యర్‌తో పని చేయలేదు.. లతా మంగేష్కర్ దేశ వ్యాప్తంగా ఎంతో మంది సంగీత దర్శకులతో పని చేసింది కానీ.. ఒపి నయ్యర్‌తో మాత్రం ఎప్పుడూ పని చేయలేదు.

చివరి పాట 2019లో.. భారత సైన్యానికి నివాళిగా లతా మంగేష్కర్ తన చివరి పాటను 2019లో రికార్డ్ చేశారు. ‘సౌగంధ్ ముఝే ఈజ్ మిట్టి కి’ పాట మార్చి 30, 2019న విడుదలైంది.

Also read:

MLA Sinciarity: కేసు నమోదైన భర్తను.. సొంత స్కూటీపై తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా..?

Kakinada: ఒక్క చేపతో లక్కు తిరిగిపోయింది.. వేలంలో ఎంత పలికిందో తెలిస్తే షాక్ తింటారు

Multiple Organ Failure: మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించిన లతామంగేష్కర్.. ఇది ఎలా జరుగుతుందో తెలుసా..?

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ