Kangana Raunat: నన్ను చంపేస్తామంటున్నారు.. సోనియాజీ మీరూ స్పందించాలి.. కంగన విజ్ఞప్తి..

సాగు చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న ఉద్యమంపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొన్ని రైతు చట్టాలను

Kangana Raunat:  నన్ను చంపేస్తామంటున్నారు.. సోనియాజీ మీరూ స్పందించాలి.. కంగన విజ్ఞప్తి..
సౌత్ ఇండియా యంగ్ సెన్సేష‌న్ హీరోలు య‌ష్‌తో పాటు అల్లు అర్జున్ ఫోటోల‌తో కంగానా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు పుష్ప సినిమాలోని ఊ అంటావా..ఉ ఉ అంటావా అనే సాంగ్‌ను యాడ్ చేశారు కంగ‌నా.
Follow us
Basha Shek

|

Updated on: Dec 01, 2021 | 9:28 AM

సాగు చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న ఉద్యమంపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొన్ని రైతు చట్టాలను రద్దుచేయడంపై కూడా విమర్శలు గుప్పించింది. ఇక భారత స్వాతంత్ర్యోద్యమం, జాతిపిత మహాత్మాగాంధీల గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇందుకు గాను ఆమెపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. కాగా సాగు చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న ఉద్యమంపై తన అభిప్రాయం చెప్పినందకు కొందరు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని కంగనా తెలిపింది. కొన్ని రోజులుగా ఈ తరహా హెచ్చరికలు ఎక్కువైపోయాయని, చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా సంబంధిత ఎఫ్‌ఐఆర్‌ కాపీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది కంగన. ‘ పంజాబ్‌లోని బటిందా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నిత్యం నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ముంబయిలో జరిగిన ఉగ్రదాడుల్లో కొందరి స్వదేశీయుల హస్తం కూడా ఉంది. అలాంటి దేశ ద్రోహులకు నేను వ్యతిరేకంగా మాట్లాడతాను. అదేవిధంగా అమాయక జవాన్లను చంపేసే నక్సలైట్లనూ నేను వ్యతిరేకిస్తాను. తుక్డే తుక్డే గ్యాంగ్‌లనూ విమర్శిస్తాను. విదేశాల్లో ఎక్కడో కూర్చుని భారత్‌లో ఖలిస్తాన్‌ ఏర్పాటుచేసేందుకు కలలు కంటోన్న ఉగ్రవాదుల ముఠాలను తిడతాను. నేను ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీజీకి కూడా ఒక విన్నపం తెలియజేయాలనుకుంటున్నాను. నాలాగే మీరూ ఒక మహిళే. మీ అత్తగారు ఇందిరాగాంధీగారు ఇలాంటి ఉగ్రవాదుల ముఠాల తుదముట్టించేందుకు తుదిశ్వాస విడిచే వరకూ పోరాడారు. నన్ను బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్‌లోని మీ ముఖ్యమంత్రికి సూచించండి’ అని కంగన పేర్కొంది.

Also Read:

Sirivennela Seetharama Sastry: వస్తానన్నారు.. కలుస్తాన్నన్నారు.. కానీ ఇలా జీవంలేకుండా వస్తారనుకోలేదు.. ఎమోషనల్ అయిన చిరంజీవి

Shreya Ghoshal: వైరల్‎గా మారిన శ్రేయా ఘోషల్‌ పదేళ్ల కిందటి ట్వీట్.. ఆ ట్వీట్‎లో ఎవరి పేరు ఉందాంటే..

Sirivennela Sitaramasastri: సిరివెన్నెలకు గూగుల్ ఘన నివాళి.. ఎమోషనల్ ట్వీట్..