AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాలీవుడ్ నటుడితో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. ప్రభాస్ సరసన నటించిన బ్యూటీ..

సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు స్టార్ హీరోస్ సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ నెట్టింట మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. సినిమా అప్డేట్స్ కంటే ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయాలే నెట్టింట వైరలవుతుంటాయి

Tollywood: బాలీవుడ్ నటుడితో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?.. ప్రభాస్ సరసన నటించిన బ్యూటీ..
Actress
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2024 | 10:03 AM

Share

సోషల్ మీడియాలో తారలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లోని స్టార్స్ అందరి చైల్డ్ హుడ్ మెమొరీస్ నెట్టంట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పుట్టిన రోజు నేడు (మార్చి 3). ఈ సందర్భంగా తమ అభిమాన తార చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందమా. పైన ఫోటోలో బాలీవుడు నటుడితో కలిసి ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు బీటౌన్ స్టార్ హీరోయిన్. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు స్టార్ హీరోస్ సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ నెట్టింట మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. సినిమా అప్డేట్స్ కంటే ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ విషయాలే నెట్టింట వైరలవుతుంటాయి. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తనే ప్రభాస్ సరసన నటించిన శ్రద్ధా కపూర్.

ఈరోజు (మార్చి 3న) శ్రద్ధా కపూర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్, సెలబ్రెటీస్. 1989 మార్చి 3న ముంబైలో జన్మించింది. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా. ఆయన సినిమాల్లో విలన్ పాత్రకు ప్రసిద్ధి. 2010లో తీన్ పట్టి సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2011లో లవ్ కా ది ఎండ్ సినిమాతో ఉత్తమ నటిగా స్టార్ డస్ట్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత 2013లో విడుదలైన ఆషికి 2 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో శ్రద్ధాకు మరింత క్రేజ్ వచ్చేసింది. ఇందులో ఆదిత్య రాయ్, శ్రద్ధా కెమిస్ట్రీ అభిమానులకు నచ్చేసింది.

ఆ తర్వాత ఏక్ విలన్, ఏబీసీడీ 2, బాఘీ, చిచోరే సినిమాల్లో నటించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో కనిపించింది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రధ్దా. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో శ్రద్ధా తెలుగులో మరో సినిమా చేయలేదు. ఈ బ్యూటీ చివరిసారిగా రణబీర్ కపూర్ జోడిగా తూ ఝూథీ మెయిన్ మక్కర్ సినిమాలో కనిపించింది. శ్రద్ధా ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు వసూలు చేస్తుంది. ఇప్పటివరకు ఆమె నికర విలువ రూ. 57 కోట్లు. శ్రద్ధా వద్ద లాంబోర్గినీ హురాకాన్ టెక్నికా రూ. 4 కోట్లు, రూ.80 లక్షల విలువైన ఆడి క్యూ7, రూ.2 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 7, కోటి రూపాయాల మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ వంటి కార్లు ఉన్నాయి. ప్రస్తుతం శ్రద్ధా రాహుల్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.