Priyanka Chopra: స్పెయిన్ వీధుల్లో గ్లోబల్ స్టార్ ఏం చేస్తుందబ్బా.. వైరల్ అవుతోన్న ప్రియాంక ఫోటో..
Priyanka Chopra: 2002లో తమిళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచియమయ్యారు అందాల తార ప్రియాంక చోప్రా. అనంతరం బాలీవుడ్ బాట పట్టిన ఈ చిన్నది అక్కడ ఊహించని స్థాయిలో రాణించారు...
Priyanka Chopra: 2002లో తమిళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచియమయ్యారు అందాల తార ప్రియాంక చోప్రా. అనంతరం బాలీవుడ్ బాట పట్టిన ఈ చిన్నది అక్కడ ఊహించని స్థాయిలో రాణించారు. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ప్రియాంక ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకొని ఏకంగా గ్లోబల్ స్టార్‌గా మారింది. ప్రియాంక అద్భుత నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి. ఫోర్బ్స్ ప్రచురించిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు ప్రియాంక. ఇలా కెరీర్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న సమయంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న ప్రియాంక ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు.
వివాహం తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న ప్రియాంక, పెళ్లికి ముందులా స్క్రీన్‌పై కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారీ బ్యూటీ. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. తాజాగా స్పెయిన్‌కు వెళ్లిన ప్రియాంక అక్కడ వీధుల్లో చేతిలో వాటర్ బాటిల్‌తో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో ఎలాంటి మేకప్ లేకుండా చాలా నేచురల్‌గా కనిపించడం విశేషం. ఇక ఈ ఫోటోతో పాటు.. ‘మీరు ముందుకు వెళ్లకపోతే.. వెనక్కి పడిపోతారు’ అని వేదాంతంతో కూడిన ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చిందీ బ్యూటీ.
View this post on Instagram
Also Read: Space Tour: అంతరిక్షంలోకి అతిథిగా 90 ఏళ్ల నటుడు.. విజయవంతంగా తిప్పి తీసుకువచ్చిన బ్లూ ఆరిజన్!
Dasara Stickers: ఈ దసరాకు మీ సన్నిహితులను పలకరించండి ఇలా.. ఎప్పటికీ గుర్తిండి పోయేలా..
Maha Samudram : మహాసముద్రంలో ముందుగా ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట కానీ కుదరలేదు..