Dasara Stickers: ఈ దసరాకు మీ సన్నిహితులను పలకరించండి ఇలా.. ఎప్పటికీ గుర్తిండి పోయేలా..
Dasara Stickers: దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో దసరా ముఖ్యమైంది. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పండుగ జరుగుతుంది. ఇక పండుగ అంటేనే శ్రేయోభిలాషులను పలకరించే సందర్భం...
Dasara Stickers: దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో దసరా ముఖ్యమైంది. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పండుగ జరుగుతుంది. ఇక పండుగ అంటేనే శ్రేయోభిలాషులను పలకరించే సందర్భం. మాములు రోజుల్లో పలకరించకపోయినా.. పండుగ వేళ అందరికీ శుభాకాంక్షలు చెప్పడం మన సంప్రదాయంలో ఓ భాగంగా వస్తుంది.
మరి దసరా శుభాకాంక్షలను అందరు చెప్పినట్లు సాధారణంగా చెబితే ఏం బాగుటుంది చెప్పండి. మారుతోన్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి కదా.! అందుకే వాట్సాప్ స్టిక్కర్ల ద్వారా విషెస్ చెప్పండి. మరి ఇంతకీ వాట్సాప్ స్టిక్కర్ల ద్వారా దసరా శుభాకాంక్షలు ఎలా చెప్పాలి.? స్టిక్కర్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి లాంటి వివరాలు స్టెప్ బై స్టెక్ ఇక్కడ తెలుసుకోండి..
* ముందుగా స్మార్ట్ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ / ఐ స్టోర్‌లోకి వెళ్లి. సెర్చ్ బాక్స్‌లో ‘నవరాత్రి 2021 వాట్సాప్ స్టిక్కర్స్’ అని సెర్చ్ చేయాలి.
* అనంతరం స్టిక్కర్స్‌తో కూడిన వివిధ రకాల యాప్‌లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత సదరు యాప్‌ను ఓపెన్ చేసి ‘ఓపెన్ స్టిక్కర్ ప్యాక్స్’ ఆప్షన్ పై నొక్కాలి.
* వెంటనే స్టిక్కర్స్ అని కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన స్టిక్కర్‌ను సెలక్ట్ చేసుకొని ప్లస్ సింబల్‌పై క్లిక్ చేస్తే వెంటనే కలెక్షన్‌లో సేవ్ అవుతుంది.
* ఇక చివరగా మీరు ఏ మెసేజింగ్ యాప్ నుంచైతే స్టిక్కర్ పంపాలనుకుంటున్నారో ఆ యాప్‌ను ఓపెన్ చేసి.. ‘యాడ్’ సింబల్‌పై క్లిక్ చేసి మీరు ఎంచుకున్న స్టిక్కర్ ఆప్షన్‌ను కన్ఫార్మ్ చేయాలి.
* దీంతో వాట్సాప్‌కు ఈ స్టిక్కర్ ప్యాక్ యాడ్ అవుతుంది.
* అనంతరం మీరు విష్ చేయాలనుకుంటున్న వారి చాట్ బాక్స్ ఓపెన్ చేసి స్టిక్కర్స్ సెలక్ట్ చేసుకొని సెండ్ చేస్తే సరిపోతుంది.
Also Read: Samantha: దసరా రోజు కీలక ప్రకటన చేయనున్న సమంత.. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పే అవకాశం..
Taapsee Pannu : హీరోలకు పోటీగా ఫిజిక్ కోసం కష్టపడ్డ బాలీవుడ్ బ్యూటీ.. రష్మీ రాకెట్ కోసం తాప్సీ ఇలా…
Fruits: ఏ పండ్లు ఆరోగ్యానికి మంచివి.. మరి ఇవి తింటే షుగర్ పెరుగుతుందా..