Samantha: దసరా రోజు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న సమంత

Narender Vaitla

Narender Vaitla | Edited By: Ram Naramaneni

Updated on: Oct 14, 2021 | 4:50 PM

Samantha: ఏ క్షణంలో సమంత, నాగచైతన్యలను విడిపోతున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారో అప్పటి నుంచి రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో సమంతదే తప్పు అన్నట్లు సోషల్‌ మీడియాలో..

Samantha: దసరా రోజు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పనున్న సమంత
Follow us

Samantha: ఏ క్షణంలో సమంత, నాగచైతన్యలను విడిపోతున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారో అప్పటి నుంచి రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో సమంతదే తప్పు అన్నట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో స్వయంగా సామ్‌ వీటన్నింటపై క్లారిటీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే విడాకులు తనను ఎంతో బాధించాయని చెప్పిన సామ్‌, కెరీర్‌లో మరింత రాణించాల్సిన సమయం ఇదేనంటూ అర్థం వచ్చేలా కొన్ని పోస్టులు చేశారు. దీంతో సమంత చేసిన పోస్టులు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా అంటే అక్టోబర్‌ 15న సమంత తన కెరీర్‌కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ మూవీని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక సామ్‌ తెలుగులో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ దర్శక ద్వయం రాజ్ డికెలతో సమంత మరోసారి పనిచేయనుందని టాక్‌. ఇది కూడా వెబ్‌ సిరీస్‌ కావడం విశేషం.. ఇక ఇవే కాకుండా సామ్‌ బాలీవుడ్‌లో ఓ సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సమంత ఇప్పటికే నటించిన శాకుంతలం, కాతు కాకుల రెండు కాదల్‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మొత్తం మీద విడాకుల తర్వాత కెరీర్‌లో మళ్లీ జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లాలని డిసైడ్‌ అయిన సమంత వరుస సినిమాలతో బిజీగా మారాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దసరా సందర్భంగా కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు సంబంధించి భారీ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Prabhas: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పాన్ ఇండియన్ స్టార్.. ఏ సినిమాలో అంటే..

Fruits: ఏ పండ్లు ఆరోగ్యానికి మంచివి.. మరి ఇవి తింటే షుగర్ పెరుగుతుందా..

Ramnath kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సంచలన నిర్ణయం.. సాంప్రదాయానికి భిన్నంగా దసరా వేడుకలు.. ఎక్కడంటే..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu