Prabhas: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పాన్ ఇండియన్ స్టార్.. ఏ సినిమాలో అంటే..

పాన్ ఇండియన్ స్టార్‌గా వరుస సినిమాలను పట్టాలెక్కించి దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రభాస్ ఓకే చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్

Prabhas: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పాన్ ఇండియన్ స్టార్.. ఏ సినిమాలో అంటే..
Prabhas
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 14, 2021 | 6:32 AM

Prabhas: పాన్ ఇండియన్ స్టార్‌గా వరుస సినిమాలను పట్టాలెక్కించి దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రభాస్ ఓకే చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. సలార్ అనే టైటిల్‌‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డార్లింగ్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రీకరణలోనూ పాల్గోంటున్నాడు ప్రభాస్.  దీంతో ప్రభాస్ స్పీడ్ చూసి.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం షాకవుతున్నారు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ.. మరోవైపు వరుస ప్రాజెక్ట్‏లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… బిజీ షెడ్యూల్‏ గడిపేస్తున్నాడు ప్రభాస్. ఇవే కాకుండా.. ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాను మించి ఉండబోతుందని గతంలోనే నాగ్ అశ్విన్ ప్రకటించాడు. దీంతో ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

నేపథ్యంలోనే ఇటీవల ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని టాక్ వినిపిసితుంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి సందీప్ ప్రభాస్‌ను ఎలా చూపిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tamosoma jyothirgamaya: నేత కార్మికుల జీవన స్థితికి అద్దంపట్టే మూవీ ‘తమసోమా జ్యోతిర్గమయ’ ప్రతి ఒక్కరూ చూడాలని కేటీఆర్ పిలుపు