AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramnath kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సంచలన నిర్ణయం.. సాంప్రదాయానికి భిన్నంగా దసరా వేడుకలు.. ఎక్కడంటే..?

సాంప్రదాయానికి దూరంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈసారి దసరా వేడుకలకు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

Ramnath kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సంచలన నిర్ణయం.. సాంప్రదాయానికి భిన్నంగా దసరా వేడుకలు.. ఎక్కడంటే..?
President Ramnath Kovind
Balaraju Goud
|

Updated on: Oct 13, 2021 | 9:45 PM

Share

Ramnath kovind Dussehra Celebrations: సాంప్రదాయానికి దూరంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఈసారి దసరా వేడుకలకు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే దసరా వేడుకల్లో పాల్గొంటుంటారు. అయితే, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు, ఎల్లుండి జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లలో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

గురువారం ఆయన లేహ్‌లోని సింధు ఘాట్‌ వద్ద సింధు దర్శన్‌ పూజలో పాల్గొంటారు. సాయంత్రం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బలగాలతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈ నెల 15న ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన అధికారులు, జవాన్లతో కలసి దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే, దేశ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ‘‘దుర్గా పూజ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! దుర్గాదేవి అన్యాయాన్ని అణచివేయడానికి, స్త్రీ శక్తి యొక్క దైవిక రూపానికి చిహ్నం. దేశ నిర్మాణంలో మహిళలకు మరింత గౌరవం.. సమాన భాగస్వామ్యం ఉండే సమాజాన్ని నిర్మించడానికి మనమందరం సంకల్పం చేద్దాం.’’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు.

Read Also…. Rafale Jets: భారత్‎కు రానున్న మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు.. 29కి చేరునున్న వాటి సంఖ్య..