Gold Price Today: పండగ వేళ మహిళలకు షాకింగ్‌.. పెరిగిన బంగారం ధరలు..!

Gold Price Today: రెండు మూడు రోజుల నుంచి నిలకడగా ఉన్న బంగారం ధరలు నిన్నటి నుంచి పరుగులు పెడుతోంది. దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి...

Gold Price Today: పండగ వేళ మహిళలకు షాకింగ్‌.. పెరిగిన బంగారం ధరలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 14, 2021 | 6:13 AM

Gold Price Today: రెండు మూడు రోజుల నుంచి నిలకడగా ఉన్న బంగారం ధరలు నిన్నటి నుంచి పరుగులు పెడుతోంది. దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. భారత్‌లో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు మార్పులున్నాయి. రెండు, మూడు రోజుల నుంచి ఉపశమనం కలిగించిన ధరలు.. ఈ రోజు కూడా పెరిగాయి. గురువారం (అక్టోబర్‌14)న కూడా ఎగబాకాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగితే.. మరి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగింది. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46, 300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,480 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,160 ఉంది.

పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

ICICI Bank Offers: పండగ సీజన్‌లో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీకే వివిధ రకాల రుణాలు.. పూర్తి వివరాలు..!

ICICI Bank Offers: పండగ సీజన్‌లో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. తక్కువ వడ్డీకే వివిధ రకాల రుణాలు.. పూర్తి వివరాలు..!