Telugu News Entertainment Bollywood Global Actress Priyanka Chopra Childhood Photo goes viral in social media on her birthday Telugu Cinema News
Viral Photo: ఆర్మీ దుస్తుల్లో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ గ్లోబల్ స్టార్.. ఎవరో గుర్తుపట్టారా మరి?
Viral Photo: తండ్రి ఆర్మీదుస్తుల్లో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్. మోడలింగ్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మిస్ వరల్డ్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. ఆతర్వాత ఓ దక్షిణాది సినిమాతో వెండితెర రంగప్రవేశం చేసింది. ఆతర్వాత బాలీవుడ్‌కు..
Viral Photo: తండ్రి ఆర్మీదుస్తుల్లో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్. మోడలింగ్‌తో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మిస్ వరల్డ్ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. ఆతర్వాత ఓ దక్షిణాది సినిమాతో వెండితెర రంగప్రవేశం చేసింది. ఆతర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. తనదైన అందం, అభినయంతో హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. అక్కడి టాప్ హీరోలందరితోనూ కలిసి నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అత్యధిక పారితోషకం తీసుకున్న భారతీయ నటీమణుల్లో ఒకరిగా నిలిచింది. తన అభినయ ప్రతిభకు గుర్తుగా పద్మశ్రీతో పాటు జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఆమె కీర్తికిరీటంలో చేరాయి. టైమ్స్, ఫోర్బ్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలు వెలువరించిన అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఈ ముద్దుగుమ్మ నిలవడం విశేషం. ప్రస్తుతం ఓ అమెరికన్ పాప్ సింగర్‌ను పెళ్లాడి హాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న ఈ సొగసరి మరెవరో కాదు.. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra).
సినిమా ఇండస్ట్రీలో ప్రియాంకది సుమారు రెండు దశాబ్దాల ప్రస్థానం. 2002లో కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార అంతకుముందు మోడలింగ్ కూడా చేసింది. 2010 మిస్ వరల్డ్ కిరీటం కూడా సొంతం చేసుకుంది. ఆతర్వాతే నటిగా హిందీ సినిమా ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది. షారుఖ్‌ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్‌కుమార్.. ఇలా స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. ఫ్యాషన్ సినిమాలో ఆమె నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. కేవలం నటిగానే కాదు నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకుంది. అందుకే వినోద రంగంలో ఆమె అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ప్రియాంకను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2018 డిసెంబర్‌లో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది జనవరిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి నేడు (జులై18) పుట్టిన రోజు జరుపుకుంటోంది. మరి ప్రియాంక మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ మనమూ ఆమెకు బర్త్ డే విషెస్ చెబుదాం. హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్..