RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌ అలాంటిది మరి.. జక్కన్న సినిమాను చూసిన డాక్టర్‌ స్ట్రేంజ్‌ డైరెక్టర్‌ ఏమన్నారంటే

Scott Derrickson: బాహుబలి సిరీస్‌ తర్వాత దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) హీరోలుగా నటించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌ అలాంటిది మరి.. జక్కన్న సినిమాను చూసిన డాక్టర్‌ స్ట్రేంజ్‌ డైరెక్టర్‌ ఏమన్నారంటే
Rrr Movie
Follow us

|

Updated on: Jul 18, 2022 | 8:52 AM

Scott Derrickson: బాహుబలి సిరీస్‌ తర్వాత దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన మరో పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan), యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (JR.NTR) హీరోలుగా నటించారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. భారతీయ సినిమాలకు సంబంధించి అంతకుముందున్న రికార్డులను తన పేరిట లిఖించుకుంది. చెర్రీ, ఎన్టీఆర్‌ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా, రాజమౌళి టేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమాను వీక్షించిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ ప్రముఖులు ద‌ర్శకులు, న‌టులు, టెక్నీషియ‌న్లు కూడా ఉన్నారు. తాజాగా మ‌రో హాలీవుడ్ స్టార్ ద‌ర్శకుడు జక్కన్న చిత్రంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయనేవరో కాదు డాక్టర్ స్ట్రేంజ్ (Doctor Strange) దర్శకుడు స్కాట్ డెరిక్సన్ (Scott Derrickson).

ఇదొక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌..

ఇవి కూడా చదవండి

మార్వెల్ కామిక్స్ సినిమాలు చూసేవారికి డాక్టర్‌ స్ట్రేంజ్‌ సినిమా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈ సిరీస్‌ నుంచి మరో పార్ట్‌ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈక్రమంలో ఈ మార్కెల్‌ మూవీ డైరెక్టర్‌ స్కాట్ డెరిక్సన్ తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ను వీక్షించారు. అనంతరం సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘గ‌త‌రాత్రి నా పుట్టిన‌రోజును నా భార్య పిల్లలతో క‌లిసి వేడుకగా జ‌రుపుకున్నాను. వారితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాను. ఈ సినిమా నాకు చాలా న‌చ్చింది. ఇది ఒక అద్భుత‌మైన రోల‌ర్‌కోస్టర్‌ రైడ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తమ ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. ధన్యవాదాలు అని స్కాట్‌కు రిప్లూ ఇచ్చింది. కాగా కొన్ని రోజుల క్రితమే డాక్టర్ స్ట్రేంజ్ స్క్రీన్ రైటర్ జాన్ స్పైహ్ట్స్ కూడా ఆర్ఆర్ఆర్ పై పొగడ్తలపై వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుండగా.. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ వెర్షన్‌లు జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..