చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మీడియా మొగల్ సినీ నిర్మాత ప్రదీప్ గుహ (60) తీవ్ర అనారోగ్యంతో కన్నుముశారు. గత కొంత క్యాన్సర్తో భాదపడుతున్న ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రదీప్ గుహ శనివారం తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో ప్రదీప్ గుహ మరణంపై బీటౌన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
అలాగే ప్రదీప్ గుహ మరణంపై బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్ పేయి, సూభాష్ ఘాయ్, లారా దత్త సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం సంతాపం తెలియాజెస్తూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రదీప్ గుహ మరణ వార్త తనను ఒక్కసారిగా షాక్కు గురిచేసిందని.. తనకు చాలా బాధకలిగిందని.. ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని మనోజ్ బాజ్ పాయ్ ట్వీట్ చేశారు.
ట్వీట్స్..
Deeply shocked and saddened to hear about my friend @guhapradeep ‘s passing away !! May you rest in peace Pradeep 🙏
— manoj bajpayee (@BajpayeeManoj) August 21, 2021
Good bye my friend #Pradeep Guha I will always be indebted for your genuine love n support to I needed n we all @Whistling_Woods international 4 your enriched guidance as a director on board since its birth. U were the makers of many in our industry👍 RIP MY FRIEND🙏🏽 pic.twitter.com/Io33oh5gM3
— Subhash Ghai (@SubhashGhai1) August 21, 2021
My dearest PG you were always the KING who was the most successful ‘Queen maker’. May we, your protégés always keep your memory alive and shining bright and may you always watch over us as you have always done. #RIP 💔. @priyankachopra @deespeak @thesushmitasen
— Lara Dutta Bhupathi (@LaraDutta) August 21, 2021
Extremely saddened by the demise of Mr Pradeep Guha. An absolute icon, a marketing genius- be it beauty queens or page 3 events – he gave them/it a pedestal to shine. Rest in peace ! pic.twitter.com/PZUd0wsflL
— Riteish Deshmukh (@Riteishd) August 21, 2021
ఇక ప్రదీప్ గుహ ది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థకు గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు మూడు దశాబ్ధాలు ఆ సంస్థకు సీఈఓగా ఉన్నారు. ఆ తర్వాత 2005లో జీ టెలిఫిల్మ్ సంస్థకు సీఈఓగా పనిచేశాడు. ప్రస్తుతం 9ఎక్స్ మీడియాలో ఎండీగా చేస్తున్నాడు. అలాగే 2000లో ఫిజా, మిథున్ చక్రవర్తి, డింపుల్ కపాడియా నటించిన ఫిర్ కబి సినిమాను నిర్మించాడు.